వెంకటాచలం, జనవరి 26, (రవికిరణాలు) : నెల్లూరు జిల్లా,సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండల పరిషత్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవంలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి పాల్గొని, జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య వేడుకలను, గణతంత్ర వేడుకలను మనం ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం.రాజ్యాంగ స్ఫూర్తితో దేశానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాము కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం,రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న పరిస్థితి.రాజ్యాంగ స్ఫూర్తికి అవాంతరాలు కలిపిస్తున్నారు.ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ బద్దంగా ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజల కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేస్తుంది.
 ప్రజలకు అవసరమైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారు.రాజ్యాంగ స్పూర్తితో ముందుకు వెళుతూ, ప్రజాస్వామ్య బద్దంగా డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ చూపించిన మార్గంలో నడవాల్సిన బాధ్యత అందరిపై ఉంది.
దేశంలో అనేక కులమతాలు మిళితమై ఉన్నా అందరం కలిసి మెలిసి ముందుకు నడుస్తున్నామంటే మహనీయుడు అంబేడ్కర్ రచించిన రాజ్యాంగమే కారణం.సమాజంలో విలువలు పడిపోకుండా, సజావుగా సాఫీగా జీవనం సాగించేందుకు మహానుభావుడు అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రచించి మనకు అందించారు.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో తీసుకొంటున్న నిర్ణయాలు రాజ్యాంగ స్ఫూర్తికి నిదర్శనాలు.
ప్రభుత్వం అన్ని వర్గాల గురించి ఆలోచన చేస్తుంది.నేను ప్రజాప్రతినిధిగా మీ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తా.నియోజకవర్గ అభివృద్ధి కోసం, ప్రజల ఉన్నతి కోసం కష్టపడే వారిని గుర్తించి వచ్చే గణతంత్ర దినోత్సవం నుంచి అవార్డులు ఇవ్వడం జరుగుతుంది.
ఈ అవార్డులకు కష్టపడి పనిచేసిన వారిని ప్రతిష్టాత్మకంగా ఎన్నుకుంటాము.ప్రతి ఒక్కరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు.