నెల్లూరు, జనవరి 12, (రవికిరణాలు) : నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గంలో ధర్మల్ విద్యుత్ కేంద్రాల రాకతో పునరావాస కేంద్రాలను నిర్మించి తరలించవలసిన గ్రామాల ప్రజల సమస్యలపై వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి నెల్లూరు ఆర్.డి.ఓ. హుసేన్ సాహెబ్, రెవెన్యూ, ఇంజినీరింగ్ అధికారులు ప్రజలతో కలిసి సమీక్ష నిర్వహించారు. భారీగా తరలివచ్చిన గ్రామాల ప్రజలు.10 సం౹౹ల తరువాత తమ మొర ఆలకించడానికి శాసన సభ్యులే స్వయంగా అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించడం సంతోషమంటూ హర్షం వ్యక్తం చేసిన గ్రామాల పెద్దలు.గ్రామాల సమస్యలపై అభిప్రాయాన్ని
తెలియజేసిన గ్రామాల పెద్దలు, ప్రజా ప్రతినిధులు. వేగవంతంగా నేలటూరు గ్రామ ప్రజల తరలింపు ప్రక్రియ పూర్తిచేసి, ఇళ్లు కట్టించి ఇచ్చే విధంగా చూస్తున్నాము.పరిశ్రమల రావడం వలన కాలుష్యం వల్ల గ్రామాలలోని ప్రజలు సర్వస్వం కోల్పోయారు.ఈ గ్రామాల ప్రజలకు రావల్సిన ఆర్ధిక నష్టపరిహారంపై, పునరావాస కేంద్రాలపై అధికారులు దృష్టి పెట్టాలి.నేను కాని ఈ కంపెనీలు రాక ముందు ఈ ప్రాంతానికి ప్రతినిత్యం వహించి ఉంటే ఒక్క కంపెనీని కూడా రానిచ్చేవాడ్ని కాదు.ఈ కంపెనీలు శ్రీకాకుళం జిల్లాలో నిర్మిచాల్సి ఉంటే అక్కడి మత్స్యకారులు వ్యతిరేకించడంతో నిలిపివేశారు.అక్కడ వద్దన్న వాటిని గత పాలకులు ప్రజలను మభ్యపెట్టి, వాటిని ఇక్కడ ఏర్పాటు చేశారు. మొదట మీఅవసరం ఉన్నంత కాలం మీతో బాగానే ఉన్నారు
కానీ తరువాత ప్రత్యేకంగా పోలీసులను ఏర్పాటు చేసుకొని మిమ్మలను దగ్గరకు కూడా రానివ్వని పరిస్థితి నష్టపోయిన గ్రామాల గురించి మాట్లాడని కొందరు తాము పరిశ్రమలకు వ్యతిరేకంగా ఉన్నమంటూ ఫిర్యాదులు చేస్తున్నారు.ఇక్కడికి వచ్చిన కంపెనీలు బ్రిటీషు పరిపాలనను తలపిస్తున్నాయి.బ్రిటీషు వాళ్ళు కూడా వ్యాపారం కోసం అంటూ మన దేశానికి వచ్చి ఆక్రమించారు.ఈ కంపెనీలు కూడా అదే ధోరణితో ప్రవర్తిస్తున్నాయి.మిమ్మల్ని మోసం చేసి, మీ అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని వారు సంపాదించుకుంటున్నారు.ప్రభుత్వ భూములు వదిలి  కమీషన్ల కోసం ప్రవేటు భూముల కొంటున్నారు.గతంలో ఉన్న ప్రభుత్వం ప్రజలకు ఆమోదం లేని భూములు కొనేయడంతో ఆ భూములు ఎందుకు వినియోగం లేకుండా పోయాయి.
గత పాలకులకు భూముల మీద, కాంట్రాక్టర్ల మీద ఉన్న శ్రద్ద నేలటూరు గ్రామ ప్రజలపై ఉండి ఉంటే ప్రజలు సంతోషంగా ఉండేవారు.గత పాలకులు స్వార్థంతో ఈ పనులు చేశారు
నేను మీకు సంబంధించిన ఏ విషయంలోను వ్యక్తి గత స్వార్దానికి తావు ఇవ్వను.ఈ ప్రాంతాల్లో ప్రజల అభివృద్ధి, సంక్షేమం గురించి ఆలోచన చేస్తాను.వారు అనుకూలంగా, సంతోషంగా ఉండే విధంగా పునరావాస స్థలాలను చూపించాలి.కాలుష్యం ద్వారా పొలాలు వ్యవసాయంకు పనికి
రాకుండా పోయాయివాటిని పరిశీలించి నష్ట పరిహారం చెల్లించే విధంగా చూడాలి.జెన్ కోలో స్థానికులకు ఉద్యోగాలు ఇప్పిస్తాము.ప్రవేటు కంపెనీలు బరితెగించి ప్రవర్తిస్తున్నాయిస్థానికులలో నైపుణ్యం గల వారితో పాటు, నైపుణ్యం లేని వారికీ ఉద్యోగాలు ఇప్పిస్తాను.నా కొరికంతా మీకు న్యాయం చేయడమే.నాకు ఏ కంపెనీలతో రాజీ లేదు, మీకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతా.మీకు న్యాయం జరుగుతుందని భావిస్తే ఎవరితోనైనా మాట్లాడుతా, ఎక్కడికైన వస్తా, మీ సమస్య పరిష్కరించేలా చూస్తాను.