కలిగిరి మండలం సూర్య న్యూస్ రిపోర్టర్ ఇంచార్జి ఊసా మధు మరియు వారి కొడుకు పైన అక్రమంగా బెదిరించి వాళ్ళ ఇళ్ల స్థలం ఆవరణాన్ని ధ్వంసం చేపించిన ఊసా మాల్యాద్రి


మేజర్ న్యూస్ కలిగిరి: 

మండల కేంద్రం అయినా కలిగిరి లోని నడిమురులో ఈరోజు ఉదయం తెల్లవారు జామునా 7 గంటల సమయం లో ఊసా మాల్యాద్రి అనే అతను అక్రమంగా  జేసీబీ ని తీసుకొని వచ్చి అక్కడ వున్నా కలిగిరి న్యూస్ రిపోర్టర్ ఊసా మధు స్థలాన్ని అక్రమంగా అధికారుల అనుమతి లేకుండా కూల్చేశారు.

పనికి ఊసా మధు వాళ్ళ అబ్బాయి అయినా ఊసా మాణ్య తేజ అడ్డం పడుతున్నాడు అని కలిగిరి పోలిస్ కాన్స్టేబుల్స్ అయినటువంటి మధు, హాజ్రాత్తయ్య లను పిలిపించి వాళ్ళ ద్వారా ఆ అబ్బాయిని బెదిరించి ఆ అబ్బాయి మొబైల్ తీసుకొని ఆ అబ్బాయిని స్పృహను కోల్పోయేలా చేశారు.

వెంటనే ఆ అబ్బాయిని తన తండ్రి హాస్పిటల్ కి తీసుకొని వెళ్లారు డాక్టర్ ఆ అబ్బాయి కి వైద్య పరీక్షలు చేసిన అనంతరం తనను ఇంటికి పంపించారు.

తీరా ఇంటికి వెళ్లి చుస్తే ఊసా మాల్యాద్రి వాళ్ళ ఇంటి స్థాలా ఆవరణం లో వున్నా పూర్తి రాళ్లను వాళ్ళ అనుమతి లేకుండా తొలిగించాడు.

ఈ ఘటనలో వేరే ఇతర అధికారులు ఎవరు పాల్గొనలేదు.