న్యాయ విజ్ఞాన సదస్సు
నెల్లూరు, జనవరి 04, (రవికిరణాలు) : నెల్లూరు జిల్లా సేవాధికార సంస్థ ఛైర్మన్, జిల్లా ప్రదాన న్యాయమూర్తి జి.వెంకటకృష్ణయ్య ఆదేశాల ప్రకారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి పి.జె.సుధ ఆధ్వర్యంలో కొండాయపాళెంరోడ్డు వనంతోపు సెంటర్ నందు న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సదస్సులో పి.జె.సుధ పిల్లలను ఉద్దేశించి ప్రాధమిక హక్కులు, విధులు గురించి వివరించారు. అలాగే బాల కార్మిక వ్యవస్థ గురించి మన సమాజంలో అనేకమంది పసిబాలలు అనేకరకాలైన పనులు, ప్రమాదకరమైన పరిసరాల్లో చేస్తుండడం చూస్తున్నాం. ఇందుకు అనేక కారణాలున్నాయి. పేదరికం ఇందుకు ప్రధానకారణంగా చెప్పుకోవచ్చు. 14 సంవత్సరాలు నిండని బాలలను కొన్ని రకాల పరిసరాలలో పనికి నియమించరాదని అలాగే ఉచిత న్యాయ సహాయం గురించి వివరించారు. తదుపరి పిల్లలను బాగుగా చదువుకోవాలని భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు చేయాలని తెలిపారు. అనంతరం పిల్లలకు పౌచ్‌లు, పెన్స్, చాక్లెట్స్, పెన్సిల్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో కె.శేఖర్ తదితరులు పాల్గొన్నారు.