తిరుపతి: పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి కలసికట్టుగా కృషి చేద్దామంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పిలుపు\నిచ్చారు. తుమ్మలగుంటలోని తెలుగుతల్లి విగ్రహం నుంచి వేదాంతపురం వరకు స్థానిక యువత బుధవారం చేపట్టిన భారీ బైక్‌ ర్యాలీలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన ఆధ్యర్యంలో తిరుపతి రూరల్‌ టీడీపీ అధ్యక్షుడు చెరుకుల జనార్థన్‌ యాదవ్‌, అతని అనుచరులు వైఎస్సార్‌సీపీలో చేరారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వారికి వైఎస్సార్‌సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం జనార్థన్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే చెవిరెడ్డి పోరాట పటిమ తనను ఆకర్షించిందన్నారు.