15-03-2022 తాడేపల్లిలో వ్యవసాయ, సహకార & మార్కెటింగ్ శాఖా మంత్రివర్యులు శ్రీ కురసాల కన్నబాబు గారిని కలసి -జిలకరమసూరి (బిపిటి 5204) రకం రైతుభరోసా కేంద్రాలలో కొనుగోలు గురించి వినతిపత్రం అందించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
 నెల్లూరు రూరల్ నియోజకవర్గ వరిధిలోని నెల్లూరు రూరల్ మండలంలో షుమారు 3000 ఏకరములలో జిలకరమసూరి (బిపిటి 5204) రకం వరిసాగుచేసి, ప్రస్తుతం కోతలకు సిద్ధంగా ఉన్నదని,  ప్రభుత్వం వారు పుట్టి ధర రూ.16620/-లు నిర్ణయించి ఉన్నారని, కానీ బయట మార్కెట్లో దళారులు పుట్టి ధర రూ.13000/-లకి మాత్రమే కొనుగోలుచేయుచున్నారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
రైతు భరోసా కేంద్రాలలో జిలకరమసూరి (బిపిటి 5204) దాన్యం ప్రొక్యూర్మెంట్ పోర్టల్ నందు వివరాల నమోదుకు వీలులేకపోవడంతో రైతులు చాలా నష్టపోతున్నారని, కావున బిపిటి 5204 రకం వరి ధాన్యం కొనుగోలుకు రైతుబరోసా కేంద్రాలలో వివరాలు నమోదుకు ప్రొక్యూర్మెంట్ పోర్టల్ నందు అవకాశం కల్పించాలి. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. 

నెల్లూరు రూరల్ మండలంలోని ప్రతి గ్రామంలో చిన్న చిన్న రైతులు చెరువు పోరంబోకు, ఫారెస్ట్ పొలాలు, అడంగల్ లో నమోదుకాని సాగుచేసుకొనుచున్న భూములు షుమారు 4000 ఏకరాలలో వరిసాగుచేసిఉన్నారు. గతఏడాది ఈ దాన్యాన్ని రైతుబరోసా కేంద్రాలలో కొనుగోలు చేసినారు. కానీ ప్రస్తుతం సదరు భూములలో పండిన దాన్యాన్ని -కొనుగోలుచేయుటకు వీలుపడదని అధికారులు తెలియజేస్తున్నందున చిన్న, సన్నకారు రైతులు చాలా ఇబ్బందులుపడుచున్నారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
 

జిలకరమసూరి (బిపిటి 5204) రకం దాన్యాన్ని రైతుబరోసా కేంద్రాల ద్వారా కొనుగోలుచేయుటకు తగుచర్య తీసుకొనవలసినదిగానూ, మరియు చిన్న, సన్నకారు రైతులు సాగుచేసుకొనుచున్న చెరువు పోరంబోకు, ఫారెస్ట్ పొలాలు, అడంగ్ల నమోదుకాని భూములలో పండిన వరిదాన్యాన్ని రైతుబరోసా కేంద్రాలలో కొనుగోలుచేయుటకు అవకాశం కల్పించి, సన్న, చిన్నకారు రైతులను ఆదుకొనవలసినదిగా మంత్రి గారిని కోరిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.