పెన్నా డెల్టా  ఛైర్మెన్ గా  జెట్టి రాజగోపాల్ రెడ్డి 





కోవూరు. మేజర్ న్యూస్ 

నెల్లూరు జిల్లా రామలింగాపురం ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయంలో శనివారం జరిగిన ఎన్నికల్లో పెన్నా డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్గా జెట్టి రాజగోపాల్ రెడ్డి ఎన్నికయ్యారు. అనంతరం వైస్ చైర్మన్ గా బీద గిరిధర్ ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అనంతరం కూటమి నాయకులు చైర్మన్, వైస్ చైర్మన్ కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. 

ఈ కార్యక్రమంలో రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ  నా మీద నమ్మకంతో 

ఈ పదవిని ఇచ్చినందుకు  ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కి,  మంత్రులకు, నాయకులకు, ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. భవిష్యత్తులో 

ఈ పదవికి మంచి పేరు తెచ్చే విధంగా  శాయిశక్తుల కృషి చేస్తానని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గనాయకులు , జిల్లా నాయకులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.