సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల సంస్థ  ఉమ్మడి జిల్లాల సమన్వయకర్త జయ భారతి  సేవలు ఎనలేనివి : జిల్లా కలెక్టర్ ధ్యాన చంద్ర 


 నేను కలెక్టర్ గా ఉన్నత స్థాయికి ఎదగడానికి కారణం మా అమ్మ : అన్నమయ్య జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ 


రవి కిరణాలు,తిరుపతి, జూన్ 30 :-


 సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల సంస్థ ఉమ్మడి జిల్లాల సమన్వయకర్త జయ భారతి  సేవలు ఎనలేనివి అని జిల్లా కలెక్టర్ ధ్యాన చంద్ర కొనియాడారు. 


 స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల ఉమ్మడి జిల్లాల సమన్వయకర్త పదవీ విరమణ కార్యక్రమం జరిగింది. 


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల సంస్థ ఉమ్మడి జిల్లాల సమన్వయకర్త జయభారతి సేవలు ఎనలేవని తెలిపారు. పదవీ రమణ అనేది ప్రతి ఒక్క ఉద్యోగికి సాధారణం అన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో సుదీర్ఘoగా 34 సంవత్సరాలు  సేవలందించారని తెలిపారు.  నేడు పదవీ విరమణ పొందుతున్న డి సి ఓ వారి జీవితాన్ని ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా గడపాలని ఆ దేవుడు వారికి ఆయురారోగ్యాలు అందించాలని కోరుకుంటున్నాను అని తెలిపారు. 


డి సి ఓ కుమారుడు మరియు ప్రస్తుత అన్నమయ్య జిల్లా కలెక్టర్ అయిన అభిషిక్త్ కిషోర్ మాట్లాడుతూ.. మా అమ్మ విజయవంతంగా తన పదవీ కాలాన్ని పూర్తిచేసుకుని ఈరోజు పదవి విరమణ పొందుతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. నేను ఈరోజు ఉన్నత స్థాయిలో అన్నమయ్య జిల్లా కలెక్టర్ గా ఉన్నానంటే దానికి మా అమ్మే కారణమని తెలిపారు. నేను చిన్నప్పుడు నుంచి పుట్టి పెరిగింది గురుకుల పాఠశాలలోనే అన్నారు. నాకు చదువు నేర్పించిన ఉపాధ్యాయులు ఇక్కడే ఉన్నారని, వారి సమక్షంలో ఈరోజు అమ్మ పదవీ విరమణ పొందుతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దయవల్ల ఈ ప్రభుత్వంలో కలెక్టర్ గా పనిచేస్తూ, అమ్మ కూడా ఇదే ప్రభుత్వంలో పని చేస్తూ ఈ పదవీ విరమణ కార్యక్రమానికి హాజరవ్వడం సంతోషంగా ఉందన్నారు. విజయం ఎలా పొందాలి, ఎలా సాధించాలి అనేది మా అమ్మని చూసే నేర్చుకున్నాను అని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో ఉమ్మడి తిరుపతి మరియు చిత్తూరు జిల్లాల ప్రధాన ఉపాధ్యాయులు, బోధన మరియు బోధనేతర సిబ్బంది డి సి ఓ సేవలను అభినందించారు.   


ఈ కార్యక్రమంలో  శ్రీకాళహస్తి  డక్కిలి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ లు ప్రభావతి, శ్రీదేవి ఉమ్మడి తిరుపతి చిత్తూరు జిల్లాల ప్రధానోపాధ్యాయులు బోధన మరియు బోధనేతర సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు.