టి డ్కో గృహ సముదాయాలను పరిశీలించిన జనసేన నేత నూనె
టి డ్కో గృహ సముదాయాలను పరిశీలించిన జనసేన నేత నూనె
నెల్లూరు సిటీ మేజర్ న్యూస్
పేద ప్రజలు ఎక్కువ గా నివసిస్తున్న వెంకటేశ్వరపురం టి డ్కో గృహ సముదాయం లో అనధికారకంగా కొందరు వాటర్ ప్లాంట్ల నిర్మించడం సమంజసం కాదని జనసేన పార్టీ జిల్లా సీనియర్ నాయకుడు నూనె మల్లికార్జున యాదవ్ పేర్కొన్నారు... గురువారం ఆయన వెంకటేశ్వరపురం లోని టి డ్కో గృహ సముదాయాలను ఆయన పరిశీలించారు....
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ గృహ సముదాయా లను గత ప్రభుత్వం పట్టించుకోకుండా నాశనం చేసిందని విమర్శించారు.
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కాలనీలలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఆంధ్ర ప్రదేశ్ టి డ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ రాష్ట్రవ్యాప్తంగా కాలనీలను సందర్శించి అక్కడ సమస్యలను తెలుసుకొని త్వరలోనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానున్నారని తెలిపారు
వెంకటేశ్వరపురం లో కాలనీవాసులకు ఏ ఇబ్బంది వచ్చినా తమకు తెలియజేస్తే వెంటనే స్పందిస్తామని సమస్యలు పరిష్కరించేందుకు అధికారులతో మాట్లాడతామని అన్నారు.
ఇక్కడ పారిశుద్ధ్యనికి సిబ్బందిని పెంచాలని అలాగే త్రాగునీటి సమస్య లేకుండా చర్యలు చేపట్టాలని వచ్చే సోమవారం కమిషనర్ కు ఒక వినతి పత్రాన్ని అందజేస్తున్నట్లు ఆయన తెలియజేశారు.