నెల్లూరు నగరంలోని స్థానిక పూలే బొమ్మ వద్ద జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు నమోదు కార్యక్రమం జనసేన రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కొట్టే వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 500 రూపాయల సభ్యత్వ నమోదు తో 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అని పవన్ కళ్యాణ్ ఆశయాలకు ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ సభ్యత్వ నమోదు లో పాల్గొనాలని పిలుపునిచ్చారు, ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్డి మాట్లాడుతూ
జనసేన పార్టీ ని ముందుకు తీస్కెళ్ళండి మీ భవితను అధ్యక్షులు పవ్కళ్యాణ్ గారు చూసుకుంటారు అని తెలియజేస్తున్న జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ గారు.
వైసీపీ పార్టీ నాయకులు జిల్లా ప్రతిష్టని గంగపాలు చేస్తున్నారని మన మంత్రి గారు చేసిన భాగోతం వలన ప్రపంచవ్యాప్తంగా జిల్లా పరువు తీసింది అని ఈ సందర్భంగా వారు తెలియజేశారు,సభ్యత్వ నమోదులో నెల్లూరు జిల్లా ను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తామని తెలియజేశారు... ఈ కార్యక్రమంలో గునుకుల కిషోర్,దుగ్గిశెట్టి సుజయ్,ప్రశాంత్ గౌడ్, పసుపులేటి హరి, శేషయ్య, హరి రాయల్, రమేష్, సురేష్, చక్రి తదితరులు పాల్గొన్నారు