జగనన్న మాట - కార్యకర్తల ఇళ్ళకి కోటంరెడ్డి బాట కార్యక్రమం 31వ డివిజన్లో 60వ రోజు నిడారంబరంగా ప్రారంభమైంది.
February 20, 2022
Jagannath Mata - The Kotamreddy walk to the houses of the workers started on the 60th day of the 31st Division
జగనన్న మాట - కార్యకర్తల ఇళ్ళకి కోటంరెడ్డి బాట కార్యక్రమం 31వ డివిజన్లో 60వ రోజు నిడారంబరంగా ప్రారంభమైంది.
ఉదయం 7 గంటలకు దేవ దిలీప్ అనే కార్యకర్త ఇంటి నుండి మొదలైన జగనన్న మాట - కార్యకర్తల ఇళ్ళకి కోటంరెడ్డి బాట. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 31వ డివిజన్, శ్రీలంక కాలనీ, రామకోటయ్య నగర్ ప్రాంతాలలో ప్రతీ కార్యకర్తతో, ప్రతీ నాయకునితో వారి ఇంటిలోనే ఏకాంతంగా మాట్లాడుతూ, ఒక కార్యకర్త ఇంటి నుండి మరో కార్యకర్త ఇంటికి వెళ్లే మార్గమధ్యలో స్థానిక ప్రజలతో మాట్లాడుతూ, వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ, సంక్షేమ పథకాలగురించి ఆరాతీస్తూ ముందుకు సాగిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
పై కార్యక్రమంలో 31వ డివిజన్ కార్పొరేటర్ బత్తల మంజుల, 31వ డివిజన్ అభివృద్ధి కమిటీ ఛైర్మెన్ బత్తల కృష్ణ మరియు వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.