జగనన్న ఇళ్లు నిర్మాణంలో పేదలకు అండగా ఉంటాం


నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

 రాష్ట్రంలోనే మోడల్ జగనన్న కాలనీ గా అధికారులు గుర్తించిన కావలి పట్టణంలోని ముసునూరు మెగా లేఅవుట్ లో పేదలైన 8,000 మందికి ఇంటి స్థలాల పట్టాలు చేయడం జరిగింది - ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి  తొలి విడత లో 3,000 ఇళ్లు నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది - ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి  ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. ఒక లక్ష 80 వేలు ప్రభుత్వం ఇస్తుందని, అలాగే లబ్ధిదారులు ఆమోదిస్తే బ్యాంకులు ద్వారా రూ. 30 వేలు పావలా వడ్డీ కి మంజూరు చేస్తారు - ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి   జగనన్న ప్రభుత్వం ఇంటి స్థలాలు ఇచ్చి, ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సహాయం కూడా చేస్తున్నప్పటికీ, పేదలు ఇళ్లు నిర్మించుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు - ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆవేదన   ఇళ్లు లేని పేదలకు జగనన్న ప్రభుత్వం చేస్తున్న సహాయం వృథా కాకూడదనే తాపత్రయం తో పలు రకాల ఆలోచనలు చేస్తున్నాను - ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి   వ్యాపారులు పెద్ద మనసు తో పేదలు ఇళ్లు నిర్మాణాలకు సహకారం అందించడానికి ముందుకు వచ్చారు - ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి   జగనన్న ముసునూరు మెగా లేఅవుట్ లో తొలి విడత లో నిర్మాణానికి మంజూరైన 3 వేలు ఇళ్లు పూర్తి గా నిర్మించేందుకు ఈ నెల 7 వ తేది నుండి ఏర్పాట్లు చేస్తున్నాం - ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి  జగనన్న మెగా లేఅవుట్ లో పేదలందరికీ ఇళ్లు నిర్మించడంతో పాటు మౌళిక సదుపాయాలు పనులు పూర్తి చేసేలా అక్కడే ఉండి పనులు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తాం - ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి  జగనన్న కాలనీ ని సర్వాంగ సుందరంగా తీర్చి దిద్ది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని కావలి ఆహ్వానించి ఆయన చేతులు మీదుగా లబ్ధిదారులు తో గృహ ప్రవేశాలు చేయిస్తాం - ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

కావలి ఆర్డీవో కార్యాలయం లో జరిగిన జగనన్న కాలనీ లో ఇళ్లు నిర్మాణాలపై అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఈ వివరాలను వెల్లడించారు. ఈ సమావేశంలో ఏఎంసీ చైర్మన్ మన్నెమాల సుకుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ బి. శివారెడ్డి, పొదుపు సంఘాల అధికారులు, హౌసింగ్ శాఖ ఇంజనీర్లు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.