సీమాంధ్ర బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉల్లిపాయల శంకరయ్య, జిల్లా కార్యదర్శి పెళ్ళూరు మునిరత్నం కుమారుని వివాహం సందర్బంగా గూడూరు రోటరీ క్లబ్‌ ఫంక్షన్‌ హాలుకు విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు. తదనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బిసి లు జగనన్న పెళ్లికానుకను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ లకు రూ.50000 వేలు బిసిలకు రూ.30000వేలు మాత్రమే ఉన్నందున ఏప్రిల్‌ 1వ తేది నుండి లక్ష రూపాయలు చేయుచున్నారని కనుక సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. జగనన్న పథకాలు రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాల అభివృద్ది జరుగుతుందని తద్వారా ప్రాంతీయ విభేదాలు రావని అన్నారు. ఈ కార్యక్రమంలో టి.గంగాధరం, ఎన్‌.శీనయ్య, పి.సిద్దయ్య, కె.జయరామరాజు, ఎన్‌.వి.కృష్ణయ్య, సిహెచ్‌ హనుమంతరావు, ఏ.రామి, వై.అంకయ్య, తదితరులు పాల్గొన్నారు.