ప్రజలు సుభిక్షంగా ఉండాలన్నదే జగనన్న లక్ష్యం .

నమ్మకానికి మరో పేరు జగనన్న

సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళులా చూస్తున్నారు.

మళ్లీ జగనన్న సీఎం కావడమే లక్ష్యం ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య.

రవి కిరణాలు, తిరుపతి జిల్లా సూళ్లూరుపేట:-

రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలన్నది జగనన్న లక్ష్యమని సూళ్లూరుపేట ఎమ్మెల్యే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు కిలివేటి సంజీవయ్య అన్నారు మంగళవారం సూళ్లూరుపేట పట్టణ సమీపంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న శేష సాయి కళ్యాణ మండపంలో మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమంలో భాగంగా జెసిఎస్ కన్వీనర్లు గృహ సారథులు వాలంటీర్లు సమావేశం నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి విజయానికి గృహ సారధులు కన్వీనర్లు సైనికుల పనిచేయాలని పిలుపునిచ్చారు. నమ్మకం భరోసా నిజాయితీకి మరో పేరే వైయస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. కోసం ఇచ్చిన మాటను ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ తలొగ్గక ఆరు నెలల  వ్యవధిలోనే 98 శాతం పనులను నెరవేర్చిన ఘనుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి, వైస్ చైర్మన్ పోలూరు పద్మ చిన్ని సత్యనారాయణ, పట్టణ అధ్యక్షుడు కళత్తూరు శేఖర్ రెడ్డి, తుపాకుల ప్రసాద్ గూగుల తిరుపాల్, అయితా శ్రీధర్ మరియు కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, గృహ సారధులు కన్వీనర్లు మరియు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.