విభజన హామీలు సాధించడములో పూర్తిగా విఫలమైన జగన్మోహన్ రెడ్డి.

కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగినా ప్రశ్నించలేని స్థితిలో జగన్మోహన్ రెడ్డి

అభూత కల్పనల తో అసత్య ప్రచారాల్తో అధికారం లోకి వచ్చిన జగన్



  కావలి నియోజకవర్గం బోగోలు లో జరిగిన బోగోలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాలేపాటి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన బోగోలు మండలం తెలుగుదేశం పార్టీ సమావేశంలో నియోజకవర్గ త్రీసభ్య కమిటీ సభ్యులు మాలేపాటి సుబ్బానాయుడు,గ్రంధి యానది శెట్టి తో కలిసి పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ  నిన్న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది. బడ్జెట్ లో తీరని అన్యాయం జరిగిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం నిరసన తెలిపే ధైర్యం కూడా లేదు  తనకు 25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు తనకు 22 మంది ఎంపీలు ఇచ్చి రెండన్నర సంవత్సరాలు గడిచినా ఎందుకు కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తేలేదో చెప్పాలి. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి గురించి అభూత కల్పనలు,అసత్య ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చారు.అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క ఆరోపణను నిరూపించలేకపోయారు. చంద్రబాబు నాయుడు గారి ఇంటిలో వెంకటేశ్వర స్వామి పింక్ డైమండ్ ఉందని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తరువాత పింక్ డైమెండ్ ఏమైందో తేల్చలేదు.చంద్రబాబు గారు 6 లక్షల కోట్లు అవినీతి చేసారని చెప్పి పుస్తకాలు వేశారు.చివరకు ఒక్క రూపాయి అవినీతిని కూడా నిరూపించలేక పోయారు. కుటుంభంలో ఎంత మంది చదువుతున్న అందరికి అమ్మవడి ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత కుటుంభంలో ఒక్కరికే ఇస్తున్నారు.45 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు పెన్షన్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మాటమార్చారు. అధికారంలోకి వచ్చిన వారం రోజులలోనే ఉద్యోగులకు CPS  రద్దు చేస్తామని చెప్పి ఉద్యోగులను మోసం చేయడమే కాకుండా వారి జీతాలు కూడా తగ్గించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమలు అవుతున్న అనేక సంక్షేమ కార్యక్రమాలను జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేశారు. వైసీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేకత విధానాలు పై నూతనంగా ఎన్నికయిన తెలుగుదేశం పార్టీ కమిటీలు రాజీ లేని పోరాటం చేయవలసి ఉంటుంది.కావున నూతనంగా ఎన్నికయిన మండల పార్టీ కమిటీ,అనుబంధ విభాగాల కమిటీలకు ఎంపికయిన వారి పై గురుతరమైన బాధ్యతలు ఉన్నాయి.వాటిని నెరవేర్చడానికి శక్తి వంచన లేకుండా పని చేయాలని కోరారు.ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కొండూరు పొలిశెట్టి,బీద గిరిధర్ తో పాటు బోగోలు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యాకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తెలుగుదేశం పార్టీ మండల కమిటీ ని ఎంపిక చేశారు.