సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడమే జగనన్న సురక్ష సంకల్పం..

 రవి కిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట:-

 ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని అర్హులందరికి అందించడమే జగనన్న సురక్ష పథకం సంకల్పమని సూళ్లూరుపేట మున్సిపల్ చైర్మన్ శ్రీమంత్ రెడ్డి అన్నారు. గురువారం సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న మన్నారుపోలూరు సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన జగనన్న సురక్ష పథకం కార్యక్రమానికి అధ్యక్షత  మున్సిపల్ చైర్మన్ శ్రీమంత్ రెడ్డి వహించారు. ముందుగా స్వాతంత్య్రోద్యమ నేత, సంస్కరణవాది బాబూ జగ్జీవన్‌ రామ్‌ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా చైర్మన్ శ్రీమంత్ రెడ్డి మాట్లాడుతూ జగనన్న సురక్ష కార్యక్రమంలో దరఖాస్తుదారులకు సంబంధిత ధ్రువీకరణ పత్రాలను వారి ఇంటి వద్దకే అందజేసేందుకు ప్రభుత్వం తగుచర్యలు తీసుకుందన్నారు. ముఖ్యమంత్రి జగన్ చేపడుతున్న సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ధ్రువీకరణ పత్రాలను మున్సిపల్ చైర్మన్ శ్రీమంత్ రెడ్డి చేతుల మీదుగా కొంతమంది అర్హులకూ అందించారు. సూళ్లూరుపేట సచివాలయ పరిధిలో 302మంది లబ్ధిదారులకు వివిధ రకాల సర్టిఫికెట్లు అందజేయనున్నట్టు చైర్మన్ శ్రీమంత్ తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వం జన్మభూమి కమిటీలుపెట్టి విఫలం చెందింది.ఆనాడు జన్మభూమి కమిటీ సభ్యులు డబ్బులు తీసుకొని ప్రభుత్వ పథకాలకు అర్హులను చేయడం జరిగింది.టీడీపీ ప్రభుత్వంలో గ్రామాల్లో జన్మభూమి సభలు పెడితే వేలకొలది అర్జీలు వచ్చిన అపని సరిగా చేసేవాళ్ళు కాదు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సచివాలయ,వాలంటీర్లు వ్యవస్థ బాగా పనిచేస్తుంది.వాలంటీర్లు అర్హులైన లబ్ధిదారులను గుర్తించడం ద్వారా ప్రభుత్వ పథకాలు ప్రజలకూ వెంటనే అందుతున్నాయి,జగనన్న సురక్ష ద్వారా ప్రతి గ్రామాల్లో, పట్టణలో ప్రజలకు మరింత లబ్ది చేకూరుతుంది అని శ్రీమంత్ రెడ్డి తెలిపారు. ఈకార్యక్రమంలో సూళ్లూరుపేట జెసిఎస్ కన్వినర్ ఐత శ్రీధర్,మున్సిపల్  కౌన్సిలర్స్,ఉమ్మిటి రమ్య,విజయలక్ష్మి,శరత్ గౌడ్, మునిప్రసాద్,బందిలి మహేష్, తుపాకుల సుశీల, గుణపాటి మునస్వామి, చెంగలమ్మ ఆలయ మాజీ సభ్యులు గోగుల తిరుపాల్ యాదవ్,తదితరులు పాల్గొన్నారు.