ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించడమే జగనన్న లక్ష్యం... ఎమ్మెల్యే కిలివేటి

జగనన్న సురక్ష క్యాంపును ప్రారంభించిన -ఎమ్మెల్యే కిలివేటి

 రవికిరణాలు ప్రతినిధి -దొరవారిసత్రం న్యూస్:- అర్హులైన ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అందించడమే మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యం అంటూ సూళ్లూరుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు కిలివేటి సంజీవయ్య అన్నారు ఆయన శనివారం దొరవారిసత్రం మండల పరిధిలోని నెలబల్లి సచివాలయం వద్ద జరిగిన జగనన్న సురక్ష క్యాంపు ప్రారంభించు కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకమునుపే ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఇడుపులపాయ నుండి ఇచ్చాపురం దాకా 3642 కిలోమీటర్లు నడిచి ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని అన్నింటిని ముఖ్యమంత్రి అయిన తర్వాత పాదయాత్రలు చేసిన వాగ్దానాలన్నిటిని నెరవేరుస్తూ ఉన్న ముఖ్యమంత్రి మన జగన్ మోహన్ రెడ్డి అలాంటిది ఇప్పుడు సాయంత్రమైతే యువగంగాళం పాదయాత్ర సాగిస్తూ రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదంటూ ఉంటే ఇది నమ్మశక్యమా ప్రజలు నమ్ముతారా గతంలో ప్రజలను మోసం చేసినట్లు ఇప్పుడు కూడా ప్రజలను మోసం చేయాలంటే ఇది మంచి పద్ధతి కాదు ప్రజలే అభివృద్ధిని చూసి ఓటు వేయాలి ప్రజలందరూ ఏకధాటిగా ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని బ్రహ్మరధాలు పడుతూ ఉంటే యువ గంగాళం బాబు ముఖ్యమంత్రి అవుతాడని డప్పులు కొట్టుకోవడం మంచి పద్ధతి కాదని ఎమ్మెల్యే అన్నారు అనంతరం ప్రతి ఒక్కరూ ఈ జగనన్న సురక్ష ను ఉపయోగించుకొని దాని ద్వారా లబ్ధిదారులు వివిధ రకాలైన సర్టిఫికెట్లు రేషన్ కార్డు కుల ధ్రువీకరణ పత్రం ఆదాయం సర్టిఫికెట్ జనన మరణ సర్టిఫికెట్ కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రాలు లాంటివి పొందాలని ఎమ్మెల్యే అన్నరు ఈ కార్యక్రమంలో తాసిల్దార్ గోపిరెడ్డి ఎంపీడీవో సింగయ్య మండల శాఖ అధికారులు జడ్పిటిసి సభ్యులు రమేష్ మండల ఉపాధ్యక్షులు దువ్వూరు గోపాల్ రెడ్డి సర్పంచి రజిని తదితరులు పాల్గొన్నారు