ప్రతి కుటుంబానికి అభివృద్ధి పథకాలు అందించడమే జగనన్న లక్ష్యం- ఎమ్మెల్యే కిలివేటి

రవికిరణాలు ప్రతినిధి -దొరవారిసత్రం న్యూస్:- ప్రతి కుటుంబానికి వారి ఆర్థిక అభివృద్ధి కోసం అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలను అందించడమే మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి లక్ష్యం అని సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు కిలివేటి సంజీవయ్య అన్నారు ఆయన మంగళవారందొరవారిసత్రం మండలం ఏకొల్లు సచివాలయం పరిధిలోని పాలెంపాడు దొరవారిసత్రం కుప్పారెడ్డిపాళెం మొదలగు గ్రామాలలో శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన " గడపగడపకు మన ప్రభుత్వం "  కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది ఈ సందర్భంగా ఎమ్మెల్యే గడపగడపకు వెళ్లి వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించి... సీఎం జగనన్న అమలు చేస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారికి సంక్షేమ పథకాల బుక్లెట్లను అందజేసి, వారికి ప్రభుత్వం ద్వారా చేకూరిన లబ్దిని వివరిoచారు కుప్పారెడ్డి పాలెం గ్రామంలోజోరు వానలో సైతం తమ గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కు దువ్వూరు బాలచంద్రారెడ్డి కి గ్రామస్తులు శాలువాలు కప్పి, హారతులు పట్టి, పూలదండలు వేసి ఆప్యాయంగా స్వాగతం పలికారు వర్షం కురుస్తున్నా కుడా ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య , శ్రీ చెంగాళమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డు ఛైర్మెన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి మరియు ప్రజా ప్రతినిధులు, నాయకులు కలిసి వర్షంలోనే ప్రతి గడపకు వెళ్ళి ఆ కుటుంబాల సభ్యులకు బుక్లెట్లను అందిస్తూ మళ్లీ  ఎన్నికల్లో జగనన్నను సంజీవయ్యను ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో తాసిల్దార్ గోపిరెడ్డి ఎంపీడీవో సింగయ్య ఎస్ఐ తిరుమలరావు ఏపిఎం పద్మావతి పలు శాఖ అధికారులు జడ్పిటిసి సభ్యులు రమేష్ మండల శాఖ నాయకులు మునస్వామి నాయుడు సురేష్ రెడ్డి జమ్మలమనేయ్య వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు