వేణుంబాకులో జగనన్న సురక్ష పథకం క్యాంప్

రవికిరణాలు ప్రతినిధి దొరవారిసత్రం  న్యూస్:- రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న సురక్ష పథకంపై మంగళవారం వేణుంభాకం గ్రామ సచివాలయంలో క్యాంపును నిర్వహించారు ఈ క్యాంప్ తాసిల్దార్ గోపిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది ఈ సందర్భంగా ఆయన సురక్ష పథకం గురించి ప్రజలకు తెలియజేశారు అనంతరం ఆ సచివాలయ పరిధిలో అర్హులైన లబ్ధిదారులకు వివిధ సర్టిఫికెట్లను అందించడం జరిగినది ఈ క్రమంలోనే కుల ధ్రువీకరణ పత్రాలు 209 ఆదాయ ధ్రువీకరణ పత్రాలు 204 రేషన్ కార్డులు 6 వివిధ రకాల కు చెందిన కార్డులు 37 ఇవ్వడం జరిగినది ప్రతి ఒక్కరు ఈ సురక్ష పథకం కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సింగయ్య సర్పంచులు ఎంపీటీసీలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు