పలు రెవెన్యూ అంశాలపై సమీక్షించిన జే సి డి కె బాలాజీ

భూ రికార్డుల స్వచ్చీకరణ, రీ సర్వే తదితర రెవెన్యూ అంశాలపై సమీక్షించిన జే సి

తిరుపతి, ఫిబ్రవరి25  (రవి కిరణాలు): -

పెండింగ్ భూ రికార్డుల స్వచ్చీకరణ పెండింగ్ మ్యుటేషన్ లు నిబంధనల మేరకు త్వరిత గతిన పూర్తి చేయాలని, రీ సర్వే , స్టోన్ ప్లాంటేషన్  వేగవంతంగా పూర్తి చేసేలా ప్రణాళికా బద్ధంగా చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు.

 శనివారం సాయంత్రం అన్ని మండలాల తాసిల్దార్లు, సర్వే అధికారులు, ఆర్డీవో లతో స్థానిక  వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి వర్చువల్ విధానంలో పలు రెవెన్యూ అంశాల పై సమీక్షించి దిశా నిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా సంయుక్త కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో భూ రికార్డుల స్వచ్చీకరణ లో భాగంగా రీ సర్వే  స్టోన్  ప్లాంటేషన్స్ త్వరిత గతిన పూర్తి చేసేలా ప్రణాలికలు సిద్ధం చేసుకొని తదనుగుణంగా టీమ్ లు ఏర్పాటు చేసుకుని సకాలంలో పూర్తి చేయాలని అన్నారు. అసైన్మెంట్ అగ్రికల్చర్  భూములు, సర్వే నంబర్ల సబ్ డివిజన్, జాయింట్ ఖాతాల, మ్యుటేషన్ ల క్లరికల్ పొరపాట్లు ఉన్నవాటిని గుర్తించి సరిచేసే కార్యక్రమం త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. రీ సర్వే జరుగుతున్న మండలాల్లో గ్రౌండ్ వ్యాలిడేషన్, గ్రౌండ్ వెక్టరైజేషన్, గ్రౌండ్ ట్రూతింగ్, వి ఆర్ ఓ లాగ్ ఇన్ డేటా ఎంట్రీ  తదితర అంశాలు సమీక్షించి వేగవంతం చేయాలని, ఎటువంటి అలసత్వం సహించేది లేదని, శ్రద్ధ పెట్టి పనిచేయాలని సూచించారు వివాదాలు లేని భూ రికార్డుల రూపకల్పన కోసమే రీ సర్వే కార్యక్రమ ఉద్దేశ్యమని ఆధునిక పరిజ్ఞానంతో అత్యంత ఖచ్చితత్వంతో కూడిన రికార్డులు ఏర్పాటు కావాలి అని అన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ కోదండరామిరెడ్డి జిల్లా సర్వే అధికారులు జయరాజ్ ఆర్డీవోలు కనక నరసారెడ్డి రామారావు కిరణ్ కుమార్ చంద్రముని రణాల్, జిల్లాలోని తాసిల్దారులు, ఉపతాసిల్దార్ సర్వే తదితరులు పాల్గొన్నారు.