జిల్లాలో ఉన్న ఏకైక ప్రభుత్వ రంగ పరిశ్రమను ప్రైవేటు పరం చేయడం తగదు :-  సూళ్ళూరుపేట సిఐటియు మండల కమిటి.
 
 శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా.సూళ్లూరుపేట:-

నెల్లూరుజిల్లాలోని శ్రీ దామోదరం సంజీవయ్య ధర్మల్ పవర్ స్టేషన్  జిల్లాలో ఉన్న ఏకైక ప్రభుత్వరంగ భారీ పరిశ్రమను ప్రవేటు పరం చేయడం తగదని సిఐటియు నాయకులు నిరసిస్తూ తహసిల్దార్ ఆఫీసు ముందు ధర్నా నిర్వహించారు.  ఈ సందర్భంగా కా సుధాకర్ రావ్ మాట్లాడుతూ  విద్యుత్ కేంద్రాన్ని ప్రైవేటు పరం చేయద్దని, భూములిచ్చిన వారిత్యాగాలను వమ్ము చేయద్దని, పనిచేస్తున్న కార్మికులకు హాని చేయద్దని, ఏకైక భారీ ప్రాజెక్టును కాపాడు కోవలసిన బాధ్యత ప్రజలందరిదని ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతరం కా పద్మనాభయ్య మాట్లాడుతూ  జెన్కో బోర్డు సమావేశం కన్సల్టెన్సీ  నియమిస్తూ  తీర్మానించడం దుర్మార్గమని, ఈనిర్ణయాన్నిఉపసంహరించుకోవాలిసిందిగా
విజ్ఞప్తిచేస్తూ సూళ్లూరుపేట తహశిల్ధార్ కె రవికుమార్ కి వినతి పత్రం అందజేసి సంబంధిత అధికారులకు అందజేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమములో సిఐటియు అధ్యక్షులు కా సాంబశివయ్య, రైతు సంఘం నాయకులు కా అల్లెయ్య, లారీ వర్కర్స్ నాయకులు సత్యం, రాజబాబు, ఆర్టీసి కార్మిక నాయకులు రమణయ్య, భ.ని.కా. నాయకులు చంద్రయ్య , శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.