విద్యార్థుల్లో వయస్సు కు తగిన ఎదుగుదల ఉందా?

రవికిరణాలు ప్రతినిధి -దొరవారి సత్రం న్యూస్:-

 విద్యార్థుల ఆరోగ్యం ఎలా ఉంది? శారీరక లోపాలు ఏమైనా ఉన్నాయా! వయసుకు తగిన శారీరక ఎదుగుదల ఉందా! రక్తహీనత కలిగిన పిల్లలు ఎవరైనా ఉన్నారా అని దొరవారిసత్రం వైద్యాధికారి చైతన్య ఆరా తీశారు. శుక్రవారం పాలెంపాడు పాఠశాల ఆవరణంలో నిర్వహించిన విలేజ్ డాక్టర్ క్లినిక్ సందర్భంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల ఆరోగ్య స్థితిగతులు గురించి ప్రధానోపాధ్యాయుని నుండి పలు విషయాలు రాబట్టారు. పిల్లలకు ప్రభుత్వం అందించే జగనన్న గోరుముద్ద ద్వారా వారికి అందాల్సిన పోషక విలువలు కలిగిన పదార్థాలను ఆహారం ద్వారా అందించడంతో ఆరోగ్యవంతంగా ఉన్నారని హెడ్మాస్టర్ తెలియజేశారు. ఆహారంతో పాటు  విప్స్ కార్యక్రమం ద్వారా ప్రతి గురువారం ఐరన్ మాత్రలు పిల్లలకు వేయాలని, దీని ద్వారా రక్తహీనత నిర్మూలించవచ్చని వైద్యాధికారి సూచించారు. శారీరక పరిశుభ్రత  పాటించాలని విద్యార్థులకు సూచించారు. అదేవిధంగా విలేజ్ డాక్టర్ క్లినిక్ లో మధుమేహం, రక్తపోటు, సాధారణ అరవకురస్తులను పరీక్షించి మందులు పంపిణీ చేశారు, ప్రభుత్వం అందిస్తున్న పలు ఆరోగ్య పథకాలను సద్వినియోగం చేసుకోవాలని గ్రామస్తులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎం ఎల్ హెచ్ పి మౌనిక, ఏఎన్ఎంశ్రావణి, డోరతి, హెల్త్ అసిస్టెంట్ సుధాకర్, డీఈవో శివ, ఆశా కార్యకర్తలు మంజుల, వీరమ్మ, అన్నపూర్ణ పాల్గొన్నారు