సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తుల ఆహ్వానం 




రాపూరు మేజర్ న్యూస్ 

2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎస్సీ,  ఎస్టీ, బీసీ,కాపు, ఇబిసి, మైనారిటీ వర్గాలకి చెందిన వారు  జనవరి 30 వ తేది నుండి ఫిబ్రవరి 7 తేది లోపు  ఓబీఎంఎంఎస్ వెబ్సైట్ నందు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని రాపూరు ఎం పి డీ ఓ భవానీ ఒక ప్రకటన లో తెలిపారు 21 నుండి 50 సంవత్సరాల లోపు వయసు గల వ్యక్తులు అర్హులన్నారు.ఇందుకోసం  కులం,ఆదాయం, ధ్రువీకరణ పత్రాలు ఆధార్ కార్డు, రేషన్ కార్డు బ్యాంకు అకౌంట్  ఫోటో  తీసుకోని ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.కిరాణా, ఫాన్సీ,గొర్రెలు బర్రెలు జనరిక్ మందుల షాపు లు  వంటివి  ఎంపిక చేస్కోవలేనన్నారు.