ఇంటర్ ప్రయోగ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి : ఏబీవీపీ
ఆర్ఐవో శ్రీనివాస రావు కు వినతి పత్రం అందజేసిన ఏబీవీపీ నాయకులు
నెల్లూరు, జనవరి 30, (రవికిరణాలు) : గురువారం జిల్లాలో ఇంటర్ ప్రయోగ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ ప్రోత్సహిస్తూ విద్యార్థుల దగ్గర నుండి డబ్బులు తీసుకుంటున్న ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలల పై చర్యలు తీసుకోవాలని ఆర్ఐఓ శ్రీనివాసరావుకి కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇలాంటి విద్యాసంస్థలపై చర్యలు తీసుకొని ప్రాక్టికల్ సక్రమంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జస్వంత్ సింగ్ మాట్లాడుతూ ఫిబ్రవరి 1 నుండి ఫిబ్రవరి 20 వరకు నాలుగు విడతలుగా ప్రయోగ పరీక్షలు జరుగుతున్నాయని ప్రయోగ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కోరారు. నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రైవేట్
కార్పొరేట్ కళాశాలలు విద్యార్థుల దగ్గర్నుండి ప్రయోగ పరీక్షలకు 2000,3000 డబ్బులు వసూలు చేస్తూ పాస్ చేయించి మార్కులు వేస్తామని విద్యార్థులను ప్రలోభ పెడుతున్నారు. ఇలాంటివి జరగకుండా సీసీ కెమెరాలతో ప్రయోగ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యశ్వంత్, భాను, సాయికృష్ణ, శివ, అనోమల్, వియామ్, తదితరులు పాల్గొన్నారు.