ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు అధికార దుర్వినియోగం చేస్తున్నారు
నేటి ( 11-04-2023 ) సాయంత్రం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు అధికార దుర్వినియోగం చేస్తున్నారు. రాజకీయ దళారీగా వ్యవహరిస్తున్నారు... ఉద్యోగులను, ఎమ్మెల్యేలను వేధించడం తప్ప ఇంకేమి చేయలేదు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఉండవల్లి అరుణ్ చేత ఢిల్లీలో మాట్లాడించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈనాడు, మార్గదర్శి, రామోజీరావు గారిపై ఉండవల్లి చేత ఇవాళ కానీ, రేపు కానీ మాట్లాడబోతున్నాడు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. వైసీపీ నేతల మాటలు ఢిల్లీలో వినడం లేదని... ఉండవల్లిని ట్రాప్ చేసి ఢిల్లీకి పంపిస్తున్నారు. 20 ఏళ్లుగా ఉండవల్లికి నేను ఏకలవ్య శిష్యుడిని, మీకు మంచి గౌరవం ఉంది. ఉండవల్లి గారు మీరు వైసీపీ ట్రాప్ లో పడొద్దు, సీతారామంజనేయులు మిమ్మల్ని ట్రాప్ చేస్తున్నారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. రామోజీరావు గారిని వేధిస్తే ఆయన మీకు లొంగుతాడాని అనుకోవడం అవివేకం. సాక్షి ఛానెల్ కి నన్ను పిలవండి... చర్చ పెట్టండి... ఈనాడు గురించి, రామోజీరావు గారి గురించి మాట్లాడుతా. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. మార్గదర్శిపై మీరు ఇన్ని వేధింపులు చేస్తున్నారు... ఒక్కరన్నా బాధితులు మీకు ఫిర్యాదు చేశారా...? ఒక్కరన్నా మార్గదర్శి కార్యాలయం వద్దకి వెళ్లి తమ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారా. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. సీతారామంజనేయులు గారు ఉలిక్కిపడకండి...? మీ రహస్య ప్రణాళిక నాకు ఎలా తెలిసిందో అని భయపడొద్దు. మీకు రాష్ట్ర వ్యాప్తంగా నెట్ వర్క్ ఉంటే... నాకు నీ దగ్గరే నెట్ వర్క్ ఉంది. నాకు సెక్యూరిటీ తగ్గించావ్, అనేకమందిని వేధింపులకు గురిచేశావ్. మీ బాగోతం మరో 6 నెలల్లో ముగుస్తుంది... మీ ఆటలు ఇక సాగవు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.