ఎరువుల దుకాణాలు తనఖీ
ఎరువుల దుకాణాలు తనఖీ
ఉదయగిరి మేజర్ న్యూస్.
ఉదయగిరి మండలంలో గల ఎరువుల దుకాణాలను ఉదయగిరి వ్యవసాయ శాఖ అధికారి ఆంజనేయులు నాయక్ ఆధ్వర్యంలో ఇంటర్నల్ స్క్వాడ్ లో భాగంగా వింజమూరు వ్యవసాయ శాఖ సహాయక సంచాలకులు N. రామిరెడ్డి తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఇంటర్నల్ స్క్వాడ్ ఏ డి ఏ రామిరెడ్డి, వ్యవసాయ శాఖ అధికారి ఆంజనేయ నాయక్ మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు సరసమైన ధరలకు ఇవ్వాలని అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కొనుగోలు చేసిన రైతులకు తక్షణమే బిల్లు ఇవ్వాలన్నారు ఎరువులు పురుగు మందులు విత్తనాలు స్టాక్ నిల్వలను పరిశీలించారు. అనంతరం ఇన్వాయి స్టాక్ రిజిస్టర్ బిల్ బుక్స్ ను పరిశీలించారు. డీలర్లు స్టాక్ అమ్మిన వెంటనే తప్పనిసరిగా బిల్లులను రైతులకు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమం లో దుత్తలూరు ఏవో సుబ్బారెడ్డి, మర్రిపాడు ఏవో ఎస్ రామ్మోహన్, వరికుంటపాడు ఏవో వీ. రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.