చెరువు పూడిక తీత పనుల పరిశీలన
చెరువు పూడిక తీత పనుల పరిశీలన
నెల్లూరు [వింజమూరు], రవికిరణాలు ఏప్రిల్ 22 :
వింజమూరు మండలం ఊటుకూరు గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో భాగంగా జరుగుతున్న చెరువు పూడిక తీత పనులను ఏపీవో సుభాషిని పరిశీలించారు కూలీల యొక్క మాస్టర్ ను పరిశీలించి తగిన సూచనలు ఇచ్చారు కూలీలకు కనీస కూలీపడే విధంగా పనులు చేయించాలని క్షేత్ర సహాయకులకు తెలిపారు ఉదయాన్నే ఆరు గంటలకు పనుల్లోకి వెళ్లి 10 గంటల వరకు పనులు చేయాలని అప్పుడే నిర్దేశించిన కూలీ వస్తుందని ఆమె తెలిపారు కొలతల ప్రకారం పనులు చేయని యెడల సక్రమంగా కూలీ రాదని ఆమె తెలిపారు కాబట్టి నిర్దేశించిన సమయంలో నిర్ణయించిన కొలతల ప్రకారం పనులు చేసి 300 రూపాయల కూలీని పొందాలన్నారు ఈ కార్యక్రమంలో ఆమెతోపాటు క్షేత్ర సహాయకురాలు బి నాగేశ్వరి కూలీలు ఉన్నారు.