దుర్గమ్మ నామస్మరణతో మారుమోగుతున్న ఇంద్రకీలాద్రి..
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా సాగుతున్నాయి. 5వ రోజు దుర్గమ్మ లలిత త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.దీంతో ఇంద్రకీలాద్రి దేవాలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. దుర్గమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. దుర్గమ్మ నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగుతుంది. దుర్గమ్మ దర్శనానికి వినాయకుడి గుడి వద్ద నుండి భక్తులు బారులు తీరారు. నేడు శుక్రవారం కావడంతో తెల్లవారుజాము నుంచి కొండ మీద భక్తులు క్యూ కట్టారు. లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో ఉన్న అమ్మని దర్శించుకుని భక్తులు పునీతులవుతున్నారు.