మైనర్ బాలికపై అఘాయిత్యం కేసులో..
మైనర్ బాలికపై అఘాయిత్యం కేసులో..
* నిందితుల అరెస్ట్
* నగర డిఎస్పీ సింధు ప్రియ వెల్లడి
నెల్లూరు క్రైం మేజర్ న్యూస్.
ఒంటరిగా కనిపించిన మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు ఓ ప్రబుద్ధుడు. అతని చెర నుండి ఆ అమ్మాయిని కాపాడుతున్నట్లుగా నటించి ఏకంగా అఘాయిత్యమే చేశాడు ..మరొక దుర్మార్గుడు. .. సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించిన ఇద్దరు నిందితులను సంతపేట సిఐ దశరథ రామారావు ఆధ్వరంలో సకాలంలో స్పందించి ఫోక్సో కేసు నమోదు చేసి అరెస్టు అనంతరం కటకటాల వెనక్కి నెట్టారు. ఈ సందర్భంగా బుధవారం సంతపేట పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర డిఎస్పీ సింధు ప్రియ వివరాలను వెల్లడించారు. సంతపేటలోని ఓ పాఠశాలలో 8వ తరగతి చదువుకుంటున్న మైనర్ బాలిక కనిపించడం లేదంటూ 26వ తేదీ ఉదయం పాఠశాల సిబ్బంది సంతపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న సీఐ దశరథ రామారావు తన సిబ్బందితో కలిసి బాలిక కోసం అన్నిచోట్ల గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో బాలికని కనుగొని విచారించగా.. సైదాపురం కు చెందిన దండే నిరంజన్ అనే వ్యక్తి పాఠశాల నుండి బాలికను మాయ మాటలు చెప్పి సౌత్ రైల్వే స్టేషన్ పరిసరాల్లోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తిస్తుండగా స్థానికులు గమనించి మందలించగా బాలిక అతని చెర నుండి తప్పించుకుని వెళ్లిపోయే క్రమంలో స్థానిక బీవీ నగర్ కు చెందిన పెంచల పృథ్వి అలియాస్ రాజేష్ అనే యువకుడు సదరు బాలికను వెంబడించి జాగ్రత్తగా ఇంటికి చేరుస్తానని మాయ మాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లి బాలికపై పలుమార్లు అత్యాచారానికి ఒడికట్టాడని, అనంతరం బాలికను తీసుకొచ్చి ఆత్మకూరు బస్టాండ్ వద్ద వదిలిపెట్టి వెళ్లిపోయాడన్నారు. నిందితుల్లో మొదటి వాడైన దండే నిరంజన్ ను, రెండవ నిందితుడు రాజేష్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన సంత పేట సీఐ దశరథ రామారావు, ఎస్సై బాలకృష్ణ, సిబ్బందిని డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. విలేఖర్ల సమావేశంలో సిఐ దశరథ రామారావు పాల్గొన్నారు.