'కొత్త ఏడాది’లో సైబర్‌ నేరగాళ్లతో జాగ్రత్త శుభాకాంక్షల పేరుతో సెల్‌ఫోన్లలోకి జొరబడే ప్రయత్నం.

ఆకర్షణీయ సందేశాలు తయారు చేసుకోవచ్చని ఊరిస్తూ లింకులు.

క్లిక్‌ చేస్తే ఏపీకే ఫైల్స్‌ డౌన్‌లోడ్‌.. సమాచారం పరాధీనం

ట్రీస్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు నౌరాజ్.




పొదలకూరు మేజర్ న్యూస్..

ప్రతి పండగను, సందర్భాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటున్న సైబర్‌ నేరగాళ్లు ప్రస్తుతం ‘నూతన సంవత్సర శుభాకాంక్షల’ పేరుతో ఉన్నదంతా దోచుకునేందుకు సిద్ధమవుతున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ట్రీస్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు షేక్ నౌరాజ్ అన్నారు. శుక్రవారం పొదలకూరు మండలంలోని గురవాయపాలెం గ్రామంలో పొదలకూరు ట్రీస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత , పొదుపు, సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ట్రీస్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు నౌరాజ్, కార్యదర్శి ఎస్.కే.అహ్మద్ మాట్లాడుతూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని రకరకాల చిత్రాలు, సందేశాలను మీ పేరుతో సహా తయారు చేసుకొని పంపవచ్చని, ఇందుకోసం ఈ కింది లింకుపై క్లిక్‌ చేసి వివరాలు నమోదు చేస్తే చాలని సెల్‌ఫోన్లకు సందేశాలు వస్తున్నాయని, పొరపాటున వాటిపై క్లిక్‌ చేశారంటే తిప్పలు తప్పవన్నారు.ఆర్బీఐ వారి సౌజన్యంతో పొదలకూరుకి చెందిన ట్రీస్ స్వచ్ఛంద సేవా సంస్థ వారు  బ్యాంక్‌ సేవలు, ఆర్థిక మోసాలపై అవగాహన కల్పిస్తున్నారన్నారు.ఈ కార్యక్రంమలో భాగంగా పలు రకాల బ్యాంకు పథకాలు, సేవల పై సంపూర్ణ అవగాహన కల్పిస్తూ  ప్రదర్శించిన పోస్టర్లు చూపరులను ఆకొట్టుకున్నాయి. సంస్థ రిసోర్స్ పర్సన్ ఎ.చంద్రశేఖర్ మాట్లాడుతూ పొదుపు అవసరం , సైబర్ నేరాలపై  బ్యాంక్‌ ప్రతినిధులమంటూ అపరిచితుల నుంచి వచ్చే మేసేజ్‌లు, ఫోన్‌ కాల్స్‌కు స్పందించవద్దన్నారు. ఫోన్‌కు వచ్చే ఓటీపీ, డెబిట్‌ కార్డుల పిన్‌, సీవీవీ వంటి నంబర్లు ఇతరులకు చెప్పవద్దన్నారు. అలాంటి గోప్యతా వివరాలను బ్యాంకులు అడగవని గుర్తించాలన్నారు.  కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఖాతాదారులకు అందిస్తున్న ప్రత్యేక పథకాలు, సేవలను ఖాతాదారులకు వివరించారు. వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికలను ఎలా తయారు చేసుకోవాలో వివరించారు.ఈ కార్యక్రమంలో  పొదుపు మహిళలు ,బ్యాంకు ఖాతాదారులు, స్థానికులు పాల్గొన్నారు.

.