యువగళం పాదయాత్రకు సంఘీభావం గా
యువగళం పాదయాత్రకు సంఘీభావం గా
సూళ్లూరుపేట పట్టణం లో టిడిపి పాదయాత్ర
రవి కిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట:-
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం
పాదయాత్ర ఈ రోజు తో 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంటున్న సందర్భముగా,
ఆయనకు సంఘీభావంగా మంగళవారం సూళ్లూరుపేట లో టిడిపి అద్వర్యం లో
పట్టణం లో పాదయాత్ర నిర్వహించారు, పట్టణ టిడిపి అధ్యక్షుడు ఆకుతోట రమేష్
ఆద్వర్యం లో జరిగిన ఈ పాదయాత్ర ను టిడిపి కార్యాలయం నుండి ప్రారంభించారు,
నియోజకవర్గం టిడిపి ఇంచార్జి నెలవల సుబ్రహ్మణ్యం తో పాటు మాజీ మంత్రి పరసా వెంకటరత్నం, అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి పాల్గొని పట్టణ కూడళ్లలో
మాట్లాడారు,ఈ సందర్భముగా నెలవల మాట్లాడుతూ అధికార వైసీపీ ప్రభుత్వం చేస్తున్న
అక్రమ వ్యాపారాలను గురించి అదే వైసీపీ కి చెందిన కో అప్షన్ సభ్యుడు బట్టబయలు
చేశారని , ఇలాంటి ప్రభుత్వాన్ని ప్రజలు 2024 తప్పక ఓడిస్తారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం లో టిడిపి నేతలు చిట్టేటి పెరుమాళ్ , కొక్కు శంకరయ్య, ఏజి కిషోర్,మాధవ్ నాయుడు ,ముని రాజా , పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.