బహిరంగ ప్రదేశాలలో

మద్యం సేవించడం నిషిద్ధం:- సిఐ మధుబాబు.


పట్టణమంతా 12 చోట్ల హెచ్చరిక బోర్డులు.


రవి కిరణాలు, తిరుపతి జిల్లా సూళ్లూరుపేట:-


సూళ్లూరుపేట పట్టణం తో పాటు సూళ్లూరుపేట పోలీస్ సర్కిల్ పరిధిలోని తడ, శ్రీహరికోట

ప్రాంతాలలో ఇక పై బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం పై నిషేధం విధించడం

జరిగిందని సిఐ మధు బాబు తెలియజేసారు, జిల్లా ఎస్పి ఆదేశాల మేరకు  బుధవారం పట్టణం లోని 12 చోట్ల సిఐ మధుబాబు స్వయంగా పోలీస్ వారి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయించారు,ఈ సందర్భముగా సిఐ మాట్లాడుతూ ఇక పై ఎక్కడా బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించకూడదని ,ఎక్కడైనా అలా జరుగుతుంటే వెంటనే సమాచారం అందిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన తెలియజేసారు.