2024 లో బాబు గారిని సీఎం ని చేయాలని కంకణం కట్టుకున్నా:-  టిడిపి తిరుపతి పార్లమెంట్ అబ్జర్వర్ కార్నాటి వరలక్ష్మి.

రవి కిరణాలు న్యూస్, తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట :- సూళ్లూరుపేట పట్టణంలో శనివారం టిడిపి తిరుపతి పార్లమెంట్ కార్యదర్శి మరియు మహిళ అబ్జర్వర్ కర్నాటి వరలక్ష్మి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో వరలక్ష్మి మాట్లాడుతూ 2024 సంవత్సరంలో బాబు గారిని సీఎంగా చేయాలని ఉద్దేశంతో కంకణం కట్టుకున్నానని అన్నారు. సూళ్లూరుపేట మా స్వగృహం అని అందువలన నేను సులూరుపేట నియోజకవర్గానికి వచ్చానని రెండు రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గూడూరు రఘునాథరెడ్డి హఠాన్మరణం చెందడంతో వారి కుటుంబం సభ్యులను పరామర్శించడానికి వచ్చానని అందులో భాగంగా సూళ్లూరుపేటకు వచ్చానని అన్నారు. అధిష్టానం నాకు అప్పగించినటువంటి బాధ్యతలను తూచా తప్పకుండా నెరవేరస్తానని నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులను కార్యకర్తలను ప్రతి ఒక్కరితో కలిసి పార్టీ కోసం పనిచేస్తానని అన్నారు భగవంతుని దయవల్ల పార్టీ అధిష్టానం సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేయమని ఆదేశిస్తే తప్పకుండా పోటీ చేస్తానని మీ అందరి సహకారం కావాలని ప్రతి ఒక్కరూ నన్ను ఒక్కసారి  ఆశీర్వదించి  అవకాశం తో గెలిపించాలని, నన్ను గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని అన్నారు. పార్టీ అధిష్టానం ఏ నియోజకవర్గంలో వీక్ గా ఉందో అక్కడ పనిచేయమని పంపారని తెలుగుదేశం పార్టీ బలోపేతానికి నావంతు కృషి చేస్తానని, చంద్రబాబు నాయుడు కౌరవ సభకు నేను రాను నేను గెలిచిన తర్వాతే అసెంబ్లీలో అడుగు పెడతానని శబదం చేశాడని అందుకు నేను నా వంతు పార్టీ కోసం ప్రతి ఒక్కరిని కలుపుకొని పార్టీని అభివృద్ధి పథంలో నడుపుతానని అన్నారు.