ఇష్టపడి చదివితే ఉన్నత స్థానాలకు..

కండలేరు బలయోగి గురుకుల పాఠశాలలో బండి వేణుగోపాల్ రెడ్డి

త్వరలో జరగబోయే పబ్లిక్ పరీక్షల్లో నూరు శాతం ఉతిర్ణత సాధించాలి

విద్యార్థులకు కరిమద్దెల నర్సింహారెడ్డి చే అవగాహన సదస్సు

విద్యార్థులు బట్టలు అరేసుకునేందుకు రోప్స్ బహుకరించిన బండి వేణుగోపాల్ రెడ్డి

వెంకటగిరి నియోజకవర్గంలోని రాపూరు మండలం కండలేరు గురుకుల పాఠశాలను శనివారం ప్రముఖ పారిశ్రామిక వేత్త బండి వేణుగోపాల్ రెడ్డి సందర్శించారు.విద్యార్థులతో మమేకమై వారి సమస్యలను అరా తీసి,బట్టలు అరేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్న విషయం తెలియడంతో వెంటనే రెండు వందల మంది పిల్లలు ఒకేసారి బట్టలు అరేసుకునేవిధంగా రోప్స్ ఏర్పాటు చేశారు.త్వరలో జరగబోయే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు దగ్గర పడే కొద్దీ విద్యార్థులో ఆందోళన నెలకొనడంతో వారికి డాక్టర్ కరిమద్దెల నర్సింహారెడ్డి చేత అవగాహన సదస్సు నిర్వహించి విద్యార్థుల్లో నెలకొన్న భయాన్ని పోగొట్టారు.అనంతరం విద్యార్థులను ఉదేశించి బండి వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చునన్నారు.త్వరలో జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో సత్తాచాటాలని హితబోధన చేశారు.అనంతరం విద్యార్థులకు బండి వేణుగోపాల్ రెడ్డి విద్య సామగ్రి పంపిణీ చేశారు.

మీ..మేలు మారువలేం సార్

గురుకుల పాఠశాలని సందర్శించి విద్యార్థుల సమస్యలను అడిగితెలుసుకుని అక్కడికక్కడే సమస్య పరిష్కరించడంతో విద్యార్థులు బండి వేణుగోపాల్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. మీ మేలు మారువలేం సార్ అంటూ ధన్యవాదాలు తెలిపారు. మీరు కష్టపడి చదివి మీ లాంటి పేద విద్యార్థులకు నా లాగా సహాయం చేసే స్థాయి కి ఎదగాలని మనస్సుపూర్తిగా కోరుకుంటున్నానన్ని బండి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.