కృష్ణపట్నం ధర్మల్ విద్యుత్ కేంద్రాన్ని వైఎస్ రాజశేఖర్ రెడ్డి కట్టిస్తే.. ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి అమ్మేస్తున్నారు

భూ ఆక్రమణలకు, అక్రమ మైనింగ్ రవాణాకు కేరాఫ్ అడ్రస్ గా నెల్లూరు జిల్లా రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచింది

కృష్ణపట్నం ధర్మల్ విద్యుత్ కేంద్రం ( జెన్ కో ) పై మూడు వేల కుటుంబాలకు పైగా ఆధారపడి ఉన్నాయి

వైసీపీ ప్రభుత్వం 25ఏళ్ల లీజు పేరుతో థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ( జెన్ కో )ను ఆదాని గ్రూప్ చేతికి అప్పగించడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం

మన రాష్ట్రం కోసం, మన కోసం, ప్రజల కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం నెల్లూరు నగర, రూరల్ పరిధిలోని తెలుగుదేశం పార్టీ నాయకులతో సమావేశం

థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని వైసీపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలనుకోవడాన్ని జిల్లా ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు

వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 1600 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును చేపడితే నేడు ఆయన కుమారుడు సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రైవేటీకరణ చేస్తుండడం దురదృష్టకరం

జెన్ కో ప్రైవేటీకరణను మేము వ్యతిరేకిస్తున్నాం.. జెన్ కో పని చేస్తున్నటువంటి ఉద్యోగులకు మా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది

వైసీపీ ప్రభుత్వం లీజు పేరుతో జెన్ కోను ప్రైవేటీకరణ చేస్తున్నడాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలి.. దీనికోసం అందరం పోరాడుదాం

కృష్ణపట్నం ధర్మల్ విద్యుత్ కేంద్రం తక్కువ కాలుష్యంతోపాటు సాంకేతికపరంగా దేశంలోనే మొదటి స్థానంలో ఉంది.. అలాంటి కేంద్రాన్ని ఆదాని చేతిలో పెట్టడాన్ని మేము నిరసిస్తున్నాం

జిల్లాలో ప్రధానంగా మూడు సమస్యలు ఉన్నాయి.. అవి జెన్ కో ప్రైవేటీకరణ, విచ్చలవిడి భూ ఆక్రమణలు, మైనింగ్ అక్రమ రవాణా, రైతులు పండించిన వరి ధాన్యానికి గిట్టుబాటు ధర లేకపోవడం వీటిపై మనమందరం కలిసికట్టుగా పోరాడుదాం

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుండి జిల్లాలో ఎక్కడ చూసినా భూ దోపిడీ, అక్రమ మైనింగ్ మితిమీరిపోయి ఉన్నాయి.. వాటిని అదుపు చేయడంలో జిల్లా యంత్రాంగం విఫలమైంది

కృష్ణపట్నం ధర్మల్ విద్యుత్ కేంద్రం లాంటిది అతి పెద్ద ప్రాజెక్ట్ తెలుగు రాష్ట్రాల్లో మరెక్కడా లేదు

గత టీడీపీ హయాం వరకు అన్ని సౌకర్యాలతో లాభాల్లో ఉన్న జెన్ కో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నష్టాల్లోకి వెళ్లింది

దీనికి కారణం వైసీపీ నాయకుల ధనదాహమే

వైసీపీ నాయకులు శృతిమించి అవినీతి, అక్రమాలకు, దోపిడీలకు పాల్పడుతున్న జిల్లా యంత్రాంగం పట్టించుకోదా

వైసీపీ ప్రభుత్వం, అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు ఆదానితో కలిసి జిల్లా ప్రజలను మోసం చేస్తున్నారు

వైసీపీ ప్రభుత్వం చేస్తున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి.. లేనిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ను ముట్టడిస్తాం

ఏ కార్యక్రమం విజయవంతం కావాలన్నా జిల్లా కేంద్రంపైనే ఆధారపడి ఉంటుంది

థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని లీజు పేరుతో వైసీపీ ప్రభుత్వం ఆదానికి అప్పగించడాన్ని నిరసిస్తూ ఈ నెల మార్చి 17వ తేది ఉదయం 9:30 గంటలకు కలెక్టరేట్ ను ముట్టడించేందుకు భారీగా తరలిరండి

ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ మేయర్ షేక్ అబ్దుల్ అజీజ్, నెల్లూరు నగర టీడీపీ ఇంచార్జ్, నుడా మాజీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, నెల్లూరు పార్లమెంటరీ టీడీపీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి, మహిళా నాయకులు, నెల్లూరు నగర, రూరల్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.