పిల్లలలో పుట్టుకతో లోపాలు గుర్తింపు....
పిల్లలలో పుట్టుకతో లోపాలు గుర్తింపు....
రవికిరణాలు న్యూస్ ...తిరుపతి జిల్లా... దొరవారిసత్రం మండలం...
దొరవారిసత్రం పి హెచ్ సి పరిధిలోని నెల బల్లి గ్రామంలో " విలేజ్ డాక్టర్" వైద్య శిబిరం నిర్వహించారు. వైద్యాధికారి పద్మావతి రోగులను పరీక్షించి మందులు పంపిణీ చేశారు. అనంతరం నెల బల్లి పాఠశాలలో విద్యార్థులకు స్క్రీనింగ్ పరీక్షల ద్వారా శరీరంలో పుట్టుకతో వచ్చిన లోపాలు, అనుకోని పరిస్థితుల్లో ఏర్పడిన అంగవైకల్యాలు పై పరీక్షలు నిర్వహించారు. వారి ఆరోగ్యo వయసుకు తగిన పెరుగుదల, రక్తహీనత వంటి వాటిని కూడాపరిశీలించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎం ఎల్ హెచ్ పి తస్లీమ్, హెల్త్ అసిస్టెంట్ విజయ్ కుమార్, సచివాలయం ఏఎన్ఎం రమణమ్మ, ఆశ కార్యకర్త సుదర్శన, పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం వాసవిలు పాల్గొన్నారు.