చెంగాళమ్మ సన్నిధిలో ఇస్రో చైర్మన్ సోమనాధ్
చెంగాళమ్మ సన్నిధిలో ఇస్రో చైర్మన్ సోమనాధ్
రవి కిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట:-
సూళ్లూరుపేట పట్టణంలో కాళ్ళంగి నది ఒడ్డున వెలసి ఉన్న భక్తుల కొంగుబంగారం కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి దక్షిణముఖ కాళీ శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయం లో ఇస్రో చైర్మన్ సోమనాధ్ పూజలు చేశారు సోమవారం శ్రీహరికోట నుండి నేరుగా చెంగాళమ్మ ఆలయానికి చేసురుకున్న సోమనాధ్ కు ఆలయ సహాయక కమిషనర్ ప్రసన్న లక్ష్మి స్వాగతం పలికారు. అనంతరం ఆయన అమ్మణ్ణిని దర్శించికొన్నారు. వేద పండితులచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. షార్ నుండి జరిగే పి ఎస్ ఎల్వి- సి 60 రాకెట్ ప్రయోగం విజయవంతకావాలని అమ్మణ్ణి చెంత కోరుకున్నారు,అనంతరం ఆస్థాన మండపం లో ఇస్రో చైర్మన్ కు సహాయక కమిషనర్ ప్రసన్న లక్ష్మి చేతులు మీదుగా ఆలయ మర్యాదలు అందించారు ,ఈ సందర్భముగా ఇస్రో చైర్మన్ సోమనాధ్ మాట్లాడుతూ షార్ నుండి ఈ రోజు 99 వ రాకెట్ ప్రయోగం చేస్తున్నట్లు ఈ ప్రయోగం విజయవంతం కావాలని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నట్లు తెలిపారు, ఈ ప్రయోగం ద్వారా అంతరిక్షం లోకి వెళ్లే స్పేడెక్సు ఉపగ్రహాలను ద్వారా వారం రోజుల తరువాత నుండి పరిశోధనలు ప్రారంభించడం జరుగుతుందని ,ఒక సారి కానీ అంతకు మించి కానీ అవసరాలకు అనుగుణంగా రెండు మిషన్లను అనుసంధాన ప్రక్రియ జరుగుతుందని తెలియజేసారు,2025 లో మొదటగా పి ఎస్ ఎల్ వి రాకెట్ ద్వారా ఎన్ వి ఎస్ 02 ఉపగ్రహ ప్రయోగం ఉంటుందని,అలాగే జి ఎస్ ఎల్ వి మార్క్ 3 ప్రయోగాలు కూడా ఉంటాయని కూడా తెలిపారు , చైర్మన్ తో పాటు గ్రూప్ మేనేజర్ గోపికృష్ణ కూడా ఉన్నారు.