తమిళ పాలిటిక్స్ లో మంగళవారం ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. చిన్నమ్మగా పేరు పొందిన అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు
వీకే శశికళ..సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను చెన్నైలోని ఆయన నివాసంలో మంగళవారం సాయంత్రం కలిశారు. రజనీకాంత్, ఆయన సతీమణి లతా రజనీకాంత్‌తో ముచ్చటించారు.
ఇటీవల దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నందుకు గానూ రజనీకాంత్‌ను శశికళ శుభాకాంక్షలు తెలియజేశారు. రజనీ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు శశికళ. అయితే సోమవారమే అన్నాడీఎంకే పార్టీ సమన్వయకర్తగా పన్నీర్ సెల్వం, సంయుక్త సమన్వయకర్తగా పళనిస్వామి సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు పార్టీ బైలాస్‌ను సవరించి, శశికళ మళ్లీ చక్రం తిప్పేందుకు ఎలాంటి అవకాశం లేకుండా చేయడంలో ఓపీఎస్, ఈపీఎస్ సఫలమయ్యారు.
అన్నాడీఎంకేలో పదవుల పందేరం పూర్తై, శశికళకు చుక్కెదురైన సమయంలోనే సూపర్ స్టార్‌ను చిన్నమ్మ కలుసుకోవడం తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు, శశికళ కొత్త రాజకీయ పార్టీ స్థాపించే అవకాశం ఉందంటూ కూడా ఊహాగానాలు వినిపిస్తున్న క్రమంలో కొత్తగా ఏర్పాటుచేయబోయే పార్టీకి మద్దతును కోరేందుకే శశికళ రజనీని కలిసినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ 79వ ప్రయోగానికి సిద్ధమైంది. నెల్లూరులోని సతీష్ థావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఆగస్టు 12 తెల్లవారుజామున 5.43గంllలకు
జీఎస్ఎల్వీ ఎఫ్13 ప్రయోగం నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కరోనా కారణంగా దాదాపు 18 నెలలపాటు ప్రయోగాలను నిలిపివేశారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో పీఎస్ఎల్వీ ప్రయోగం తర్వాత కరోనా విజృంభించడంతో ప్రయోగాలు ఆగిపోయాయి. ఇక ఆగస్టులో తిరిగి లాంచింగ్ కి ఏర్పాట్లు ప్రారంభించారు. కాగా జీఎస్ఎల్వీ ఎఫ్ 10 ప్రయోగం ఇప్పటికే నాలుగు సార్లు వాయిదా పడింది. ఐదవసారి విజయవంతం చేయడానికి ఇస్త్రో శాస్త్రవేత్తలు ప్రయత్నం చేస్తున్నారు.
జీఎస్‌ఎల్‌వీ ఎఫ్10 ద్వారా 2,268 కిలోల బరువు కలిగిన భూ పరిశీలన ఉపగ్రహం (ఈవోఎస్-03) అనే నూతన ఉప గ్రహాన్ని భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులో భూ స్థిర కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటి వరకు భూమిని పరిశీలించేందుకు సూర్యానువర్థన ధృవ కక్ష్య వరకు మాత్రమే ఉపగ్రహాలు పంపింది భారత్.. సూర్యానువర్థన ధృవ కక్ష్య భూమి నుంచి 506 నుంచి 830 కిలో మీటర్ల ఎత్తులో ఉంటుంది.
ఇక ఎప్పుడు పంపే భూ పరిశీలన ఉపగ్రహం (ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్) భూమి నుంచి 36 వేల కిలోమీటర్ల ఎత్తులో ఉండనుంది. ఈసారి ఈవోఎస్-03 అనే రిమోట్ సెన్సింగ్ శాటిలైట్‌ను మొట్టమొదటిసారిగా భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టేవిధంగా ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించారు.
ఇక దీని ప్రత్యేకతలను తెలుసుకుందాం
► శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి ఇప్పటి వరకు 78 ప్రయోగాలు జరిగాయి.. ఇప్పుడు జరిగేది 79వ ప్రయోగం ► జీఎస్‌ఎల్‌వీ రాకెట్ ప్రయోగాల సిరీస్‌లో 14వ ప్రయోగం.. ► దేశ భద్రత అవసరాలు, రక్షణ వ్యవస్థకు అనుసంధానం, దేశంలో ఉపద్రవాలు/విపత్తులు సంభవించినపుడు ముందస్తు సమాచారాన్ని తెలుసుకోవడం కోసం ఈవోఎస్-03 రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నారు. ► ఈ ఉపగ్రహం భూమికి 36 వేల కిలోమీటర్లు ఎత్తు నుంచి అత్యంత పవర్‌ఫుల్ కెమెరాలతో 50 మీటర్ల నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో భూమిపై జరిగే మార్పులను ఎప్పటికప్పుడు ఛాయా చిత్రాలను తీసి పంపిస్తుంది. సుమారు 10 సంవత్సరాలు ఈ ఉపగ్రహం తన సేవలను అందిస్తుంది.
అమరావతి రాజధానిలో రైతుల నిరసనలు 600వ రోజుకు చేరుకున్నాయి. భారీ ర్యాలీలకు రాజధాని రైతులు పిలుపునిచ్చారు. భారీగా పోలీసులు మోహరించారు. రాజధానిలోకి కొత్తవారిని అనుమతించడం లేదు. రాజధానిలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
ప్రకాశం బ్యారేజీ, సీతానగరంతో పాటు రాజధాని ప్రాంతంలో బారీగా పోలీసులు మోహరించారు. ప్రకాశం బ్యారేజీ సహా కరకట్ట వెంట పోలీసులు ఆంక్షలు విధించారు. కరకట్టపై 4 చోట్ల చెక్ పోలీసులు ఏర్పాటు చేశారు. కరకట్టపై వాహనాలను అపి చెక్ చేస్తున్నారు.
మరోవైపు రాజధాని ప్రాంతంలోకి మీడియాకు అనుమతి నిరాకరించారు. చెక్ పోస్టులు ఏర్పాటు చేసి మీడియా ప్రతినిధులను పోలీసులు నిలిపివేస్తున్నారు. కరకట్టపై మంతెన సత్యనారాయణ ఆశ్రమం వద్దే మీడియా ప్రతినిధులను అడ్డగించారు. రాజధానిలోకి మీడియాను పంపించవద్దని పైనుంచి ఆదేశాలు వచ్చాయని పోలీసులు అంటున్నారు.
విజయవాడ నుంచి ప్రకాశం బ్యారేజీ మీదుగా రాజధానికి వెళ్లే మార్గంలో అడుగడుగునా ఆంక్షలు విధించారు. ప్రకాశం బ్యారేజీ, సహా కరకట్ట వెంట పోలీసుల ఆంక్షలు విధించారు. కరకట్టపై నాలుగు చోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. భారీ ఎత్తున పోలీసులను మొహరించారు.
స్థానికులను మాత్రమే కరకట్ట రహదారిపై అనుమతిస్తున్నారు. ఆధార్ కార్డు లేదా ప్రభుత్వ గుర్తింపు కార్డు ఉంటేనే రాకపోకలకు అనుమతిస్తున్నారు. వాహనాలను పూర్తిగా తనిఖీ చేశాకే పంపిస్తున్నారు. పోలీసు ఆంక్షలతో స్థానుకులు తీవ్ర ఇ
ఒక అథ్లెట్‌గా రాణించాలంటే శారీరక ధృఢత్వం చాలా అవసరం. అన్ని విధాలా ఫిట్‌గా ఉన్నవారు మాత్రమే అథ్లెట్‌గా విజయాలు సాధించగలరు.
పీటీ ఉష, అంజూ బాబీ జార్జ్, మిల్ఖా సింగ్ వంటి కొద్ది మంది భారతీయులు మాత్రమే అథ్లెటిక్స్‌లో ప్రపంచ స్థాయి విజయాలు సాధించారు. ఈ ముగ్గురూ కొద్ది పాటి తేడాతో ఒలింపిక్ పతకాలకు దూరమయ్యారు. ఆ వెలితిని నీరజ్ చోప్రా భర్తీ చేశారు.
టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్‌ను 87.58 మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నారు. అయితే, నీరజ్ చోప్రా జావెలిన్ విసరడం ఎప్పుడు ప్రారంభించారో తెలుసా? ఒలింపిక్ పతకం వరకూ ఆయన సాగించిన ప్రయాణంలోని అయిదు కీలకమైన మలుపులివే.
1. పానిపట్ కుర్రాడి 11 ఏళ్ల శ్రమ
హర్యానాలోని పానిపట్ సమీపంలో ఉన్న ఖాండ్రా గ్రామంలో నీరజ్ జన్మించారు. వారిది రైతు కుటుంబం. నీరజ్ 2010లో పానిపట్‌లోని క్రీడా మైదానంలో జస్బీర్ సింగ్ జావెలిన్ విసురుతుంటే చూశారు. అప్పుడు ఆయన వయసు 11 ఏళ్లు. అది ఆయన జీవితాన్ని మలుపు తిప్పిన దృశ్యం.
"ఆ ఆటలోని వేగం నన్ను మురిపించింది. జస్బీర్ దేహ దారుఢ్యం, అతను పరిగెట్టే తీరు నాకెంతో స్ఫూర్తినిచ్చింది. ఆటలు చూడడం నాకిష్టంగా ఉండేది. కానీ, ఈ ఆట చూశాక నాకే ఆడాలనిపించింది" అని నీరజ్ కొన్నేళ్ల కిందట చెప్పారు.
BEN STANSALL
2. అప్పుడు నీరజ్ బరువు 80 కిలోలు
పాలు, వెన్న అమ్ముకునే రైతు కుటుంబంలో పెరిగిన నీరజ్ అప్పుడు చాలా బరువుగా ఉండేవారు. వాళ్ల నాన్న అతడిని బరువు తగ్గించడం కోసం పానిపట్‌కు తీసుకొచ్చారు. జావెలిన్ ప్రాక్టీస్‌లోనే ఉంటే బరువు తగ్గవచ్చని ఆయన భావించారు.
నీరజ్‌కు ఆ ఆట బాగా నచ్చింది. అదే ఆయనకు సర్వస్వమైపోయింది. మొదట్లో ఆయన పానిపట్‌లో జై చౌదరి వద్ద శిక్షణ తీసుకున్నారు. ఆ తరువాత పాటియాలా స్పోర్ట్స్ అథారిటీ సెంటర్లో ప్రపంచ ప్రఖ్యాత జావెలిన్ క్రీడాకారుడు యువే హూన్ స్వయంగా నీరజ్‌కు ప్రొఫెషనల్ శిక్షణ ఇచ్చారు. జావెలిన్‌లో 100 మీటర్ల రికార్డును సృష్టించిన ఏకైక క్రీడాకారుడు యువే హూన్.
నీరజ్ 2016లో అండర్-20 వరల్డ్ చాంపియన్‌షిప్ గెలిచారు. 2018 కామన్‌వెల్త్, ఆసియా క్రీడల్లో బంగారు పతకాలు గెల్చుకున్నారు. ఆ ఘనత సాధించిన తొలి భారతీయ జావెలిన్ ఆటగాడు నీరజ్. ప్రస్తుతం ఆయన స్వీడన్‌కు చెందిన క్లాజ్ బార్టోనెజ్ వద్ద శిక్షణ తీసుకుంటున్నాడు.
3. ఒలింపిక్స్‌కు ముందు కుడి చేతికి గాయం
ఆటల్లో గాయాలు అవుతూనే ఉంటాయి. అయితే, కొన్ని గాయాలు కెరీర్‌ను దెబ్బతీసేవిగా ఉంటాయి. 2012లో పానిపట్‌లో బాస్కెట్ బాల్ ఆడుతున్నప్పుడు నీరజ్ మణికట్టుకు గాయమైంది. ఆ గాయం నుంచి కోలుకుని మళ్లీ ఆట కొనసాగించారు.
మళ్లీ 2019లో అదే చేతికి గాయమై దాదాపు 8 నెలలు క్రీడకు దూరమయ్యారు. ఆ గాయం నుంచి కోలుకోవడం నీరజ్‌కు సవాలుగా మారింది. ఎట్టకేలకు ఇండియన్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ నిర్వహించిన టెస్ట్ కాంపిటీషన్లో ఆయన 83 మీటర్ల దూరానికి జావెలిన్ విసరగలిగారు.
ఆయన పట్టుదల, నిర్విరామ శ్రమ ఎలాంటిదో అసలైన వేదిక మీద నిరూపితమైంది. ఒలింపిక్స్‌లో నీరజ్ 87.58 మీటర్ల దూరానికి జావెలిన్ త్రో చేసి గోల్డ్ మెడల్ సాధించారు.
4. స్కూలు చదువు వదిలేయాల్సి వచ్చింది
పన్నెండేళ్ల వయసులో జావెలిన్ త్రో ఆడడం ప్రారంభించిన నీరజ్ స్కూలు చదువును మధ్యలోనే వదులుకోవాల్సి వచ్చింది. 10, 12 తరగతుల ప్రైవేటుగా కట్టి పాసయ్యారు.
ఇప్పుడు కురుక్షేత్ర యూనివర్సిటీ నుంచి కరెస్పాండెన్స్ బీఏ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. 18 ఏళ్ల వయసులో స్పోర్ట్స్ కోటా ఇండియన్ ఆర్మీలో ఉద్యోగం వచ్చింది డిగ్రీ లేకపోయినా ఆయనకు డిప్యూటీ సుబేదార్‌గా ప్రమోషన్ ఇచ్చారు.
రాజ్‌పుతానా రైఫిల్స్‌లో ఉన్న నీరజ్‌కు ఒలింపిక్ మెడల్ గెలవగానే మొదటి ప్రశంసలు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నుంచే లభించాయి.
5. నీరజ్ ఇప్పటిదాకా గెలిచిన పతకాలు, అవార్డులు
19 ఏళ్ల వయసులో అండర్-20 ప్రపంచ చాంపియన్‌షిప్ గెలవడంతో నీరజ్ మొదటిసారి వార్తల్లోకెక్కారు. అప్పుడు కూడా ఆయన 86.48 మీటర్లతో ప్రపంచ రికార్డు సృష్టించారు. ఆ ఘనత సాధించినందుకు ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ ఆయనను అభినందిస్తూ ఒక పోస్ట్ రాశారు.
2018లో నీరజ్ కామన్‌వెల్త్ క్రీడల్లో, ఆసియన్ గేమ్స్‌లో స్వర్ణ పతకాలు గెలిచారు. అదే ఏడాది భారత ప్రభుత్వం ఆయనను అర్జన అవార్డుతో సత్కరించింది.
ఇదీ పానిపట్ పల్లె నుంచి టోక్యో ఒలింపిక్ గోల్డ్ దాకా నీరజ్ సాగించిన ప్రయాణం. ఈ ప్రయాణంలో ఆయన ప్రతి దశలోనూ ముందడుగే వేశారు. స్థిరంగా ఎదుగుతూ వచ్చారు.
రెండు వేర్వేరు వ్యాక్సిన్లు కలిపి తీసుకోవడానికి సంబంధించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) కీలక ప్రకటన చేసింది. కోవిషీల్డ్, కోవాగ్జిన్ మిక్స్ చేసి వేసుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలు వస్తాయని ఐసీఎంఆర్ ప్రకటించింది. కోవిషీల్డ్, కోవాగ్జిన్ కలిపి తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుందని అంటోంది.
రెండు వ్యాక్సిన్లను కలిపి తీసుకోవడంపై ఎప్పటినుంచో చర్చ నడుస్తన్న మన దేశంలో ఆ మేరకు పరిధోనలు జరుపుతున్నారు. దీనిపై ఐసీఎంఆర్ కూడా అధ్యయనం చేసింది. రెండు వ్యాక్సిన్లను కలిపి తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు
భారత దేశంలో త్వరలో హైడ్రోజన్ ఇంధనంతో రైళ్ళు పరుగులు పెట్టనున్నాయి. జర్మనీ, పోలాండ్లలో ప్రస్తుతం హైడ్రోజన్ ఇంధనంతో రైళ్ళ ట్రయల్ రన్ కొనసాగుతుంది. ఈ క్రమంలోనే మనదేశంలో సైతం హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ అధారిత టెక్నాలజీ కోసం కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ బిడ్లను అహ్వానించింది.
డీజిల్ రైళ్ళకు హైడ్రోజన్ ను ఉపయోగించి నడిపేందుకు అవకాశం ఉంటుందో లేదో తొలుత పరీక్షించనున్నారు. ఈ పరిజ్ణానాన్ని ఉత్తర రైల్వేలోని సోనిపట్-జింద్ సెక్షన్ లోని డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ లో పరీక్ష నిర్వహిస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
డీజిల్ రైలును హైడ్రోజన్ గా మార్చటం ద్వారా సంవత్సారానికి 2.3కోట్ల ఖర్చు అదా చేయటంతోపాటు కార్బన్ ఉద్ఘారాలను తగ్గించి కాలుష్యాన్ని నివారించేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది. ఈ పైలట్ ప్రాజెక్టు విజవంతంగా అమలు చేసిన తరువాత ట్రాక్ లన్నీ విద్యుదీకరణ చేయటంతోపాటు, హైడ్రోజన్ ఫ్యూయల్ తో రైళ్ళను నడపాలన్న ఆలోచనతో ఉన్నారు.
హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ అధారిత డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ బిడ్డింగ్ సెప్టెంబర్ 21న ప్రారంభమై అక్టోబర్ 5న ముగుస్తుంది. హైడ్రోజన్ ఇంధనం, సౌరశక్తి నుండి నీటిని ఎలెక్ట్రోలైజింగ్ చేయటం ద్వారా హైడ్రోజన్ ఉత్పత్తి అవుతున్నందున ఇది, హరిత వంతమైన రైల్వే రవాణాకు మార్గం సుగమమవుతుంది.
ఆదివారం అమావాస్య ఎంతో విశిష్టతమైనదని హిందూ పురాణాలు చెబుతున్నాయి. సంప్రదాయలు ఆచరించే క్రమంలో గుమ్మడి కాయకు భలే డిమాండ్ పెరిగింది. మార్కెట్ లో గుమ్మడి కాయలు తగినన్ని లేకపోవడంతో ఒక్కసారిగా అమావాస్య గుమ్మడి కాయ ధర కొండెక్కింది. నాయుడుపేట, గూడూరు మార్కెట్ లలో గుమ్మడి కాయ ధర రూ. 1000 పలుకుతోంది. ప్రతి 100 సంవత్సరాలకి అడి కృత్తిక ఆదివారం అమావాస్య నేపథ్యంలో హిందువులు పరమ పవిత్రంగా పూజలు చేసే ఆదివారం అమావాస్య కు ప్రాముఖ్యత సంతరించుకుంది.ఆదివారం అమావాస్య కావడంతో కుటుంబ సభ్యులు చలి నీళ్ల స్నానం ఆచరించి ముఖ ద్వారాలను పూజించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇండ్ల వద్ద, దుకాణాల వద్ద, ఆలయాల్లో అమావాస్య పూజ నేపథ్యంలో గుమ్మడి కాయ దిష్టి తీస్తూ పూజలు ఎక్కడా చూసిన దృశ్యాలు కనిపించడంతో ఆదివారం అమావాస్య విశిష్ట ప్రాధాన్యత సంతరించుకుంది.
31న మద్యం దుకాణాలు బార్ అండ్ రెస్టారెంట్లు వ్యాపార సమయాల్లోఎలాంటి మార్పుల్లేవ్
24,డిశంబరు:
రాష్ట్రంలోని వివిధ మద్యం దుకాణాలు బార్ అండ్ రెస్టారెంట్లు నిత్యం పనిచేస్తున్న విధంగానే నూతన సంవత్సర ప్రారంభాన్ని పురస్కరించుకుని
ఈనెల 31వతేది కూడా యదావిధంగా నిర్దేశిత సమయాల్లోనే పనిచేస్తాయని రాష్ట్ర బీవరేజెస్ కార్పొరేషన్ ఎండి డి.వాసుదేవ రెడ్డి తెలియజేశారు.
రానున్న జనవరి 1వతేదీ నూతన సంవత్సరం సందర్భంగా
ఈనెల 31వతేదీన మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్ల వ్యాపార సమయాల్లో మార్పులు ఏమైనా ఉన్నాయాయని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి
తన కార్యాలయానికి అనేక ఫోన్ కాల్స్ వస్తున్న నేపధ్యంలో ఆయన దీనిపై స్పష్టత ఇచ్చారు.
రాష్ట్రంలో ప్రస్తుతం మద్యం దుకాణాలు ఉదయం 11గం.ల నుండి రాత్రి 9గం.ల వరకు,బార్ అండ్ రెస్టారెంట్లు ఉదయం 10గం.ల నుండి రాత్రి 10గం.ల వరకూ పనిచేస్తున్న విధంగానే ఈనెల 31వతేదీన కూడా అదే సమయాల్లో యదావిధిగా పనిచేస్తాయని
ఈసమయాల్లో ఎలాంటి మార్పులు లేవని ఎండి వాసుదేవ రెడ్డి స్పష్టం చేశారు
గల్ఫ్ దేశం ఒమన్‌కు వెళ్లాల్సిన అన్ని విమానాలను నిలిపివేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. వారం రోజుల పాటు రెండు దేశాల మధ్య రాకపోకలు నిలిపివేసినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. ఒమన్ వారం పాటు అన్ని దేశాలకు చెందిన విమానాలను మూసివేయాలని సుల్తానేట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎయిరిండియా విమానాలను రద్దు చేసింది. ఇప్పటికే బ్రిటన్ నుంచి వచ్చే విమానాలను కేంద్రం ఈ నెల 31వ వరకు రద్దు చేసింది. కరోనా వైరస్ కొత్త వేరియంట్ వ్యాప్తి దృష్ట్యా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. విమానాశ్రయాలలో కొవిడ్ టెస్టులు నిర్వహిస్తామని, పరీక్షల్లో పాజిటివ్ వస్తే నిర్బంధ క్వారంటైన్‌కు పంపనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. సోమవారం అర్ధరాతి నుంచి యూకే నుంచి వచ్చిన విమానాలపై సస్పెన్షన్ విధిస్తుండగా.. ఈ ఏడాది చివరి రోజు అర్ధరాత్రి వరకు తాత్కాలిక నిషేధం కొనసాగుతుందని మంత్రిత్వశాఖ పేర్కొంది.
బ్రిటన్‌లో బయటపడిన కరోనా కొత్త జన్యువు ప్రపంచాన్ని అల్లాడిస్తోంది. కొత్తరకం కరోనా వైరస్‌తో దేశాలన్నీ మరోసారి అప్రమత్తమవుతున్నాయి. ముందుజాగ్రత్త చర్యగా యూకే వచ్చిపోయే అంతర్జాతీయ విమాన సర్వీలపై తాత్కాలిక నిషేధం విధిస్తున్నాయి. యూరప్ దేశాల నుంచి వచ్చే వారికి ఆర్టీపీసీఆర్ టెస్ట్, క్వారంటైన్ తప్పనిసరని పేర్కొంది భారత విమానయాన శాఖ. యూకేలో కొత్తరకం వైరస్ విషయంలో ముందుజాగ్రత్త చర్యగా మరిన్ని దేశాలు విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. ప్రపంచ దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా యూకే నుంచి విమాన, రైళ్ల రాకపోకల్ని తాత్కాలికంగా ఆపేశాయి. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ఇటలీ కూడా బ్రిటన్ విమానాలను నిలిపివేసింది.గత రెండు వారాల్లో ఎవరైనా బ్రిటన్ సందర్శిస్తే..వారిని కూడా ఇటలీలోకి అనుమతించడం లేదు. పోర్చుగల్ మాత్రం తమ పౌరులను మాత్రమే యూకే నుంచి అనుమతిస్తోంది. అది కూడా కొవిడ్ నెగటివ్ రిపోర్టు ఉన్నవారిని మాత్రమే విమానాల్లో అనుమతిస్తున్నారు.
కొత్త రకం కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో దాన్ని అరికట్టడానికి లండన్ సహా దక్షిణ ఇంగ్లాండ్‌లో లాక్‌డౌన్ విధించారు. కొత్తరకం కరోనా వైరస్ ఒకరి నుంచి ఒకరికి సులభంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్ 70 శాతం ఎక్కువ వేగంగా ఇది వ్యాప్తి చెందుతోంది. బుధవారం నుంచి నమోదైన కేసుల్లో 60 శాతం కంటే ఎక్కువే కొత్తరకం వైరస్ కేసులున్నాయి. ఇటలీలోనూ పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించారు. క్రిస్మస్ షాపింగ్ కోసం ప్రజలు బహిరంగంగా గుమిగూడే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో ఇటలీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 24 నుంచి జనవరి 6 వరకు ఇటలీలో రెడ్‌జోన్ ప్రకటించారు. కొత్తరకం కరోనా వైరస్‌తో అప్రమత్తమైన బ్రిటన్ ప్రభుత్వం కఠిన లాక్‌డౌన్ అమలు చేస్తోంది. క్రిస్మస్ వేళ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రస్తుతం అక్కడి టైర్-4 నిబంధనలను అమలు చేస్తోంది.
నిత్యావసరం కాని సరకుల దుకాణాలు, వ్యాపారాలు, వ్యాయామశాలలు, సినిమా హాళ్లు, సెలూన్లను రెండు వారాలు మూసివేశారు. దక్షిణ ఇంగ్లాండ్‌లో తాజా వైరస్ ఎక్కువగా ప్రబలుతున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. భారత్ కూడా నూతన రకం వైరస్ వ్యాప్తిని నివారించేందుకు సన్నద్ధమవుతోంది. యూకే పరిణామాలను భారత్ నిశితంగా పరిశీలిస్తోంది. ప్రస్తుతానికి భయపడాల్సిందేమీ లేదనన్నారు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్. బ్రిటన్ నుంచి విమానాల రాకపోకలపై భారత్ ఆంక్షలు విధించింది. డిసెంబరు 31వరకు బ్రిటన్‌కు వెళ్లే, అక్కడి నుంచి వచ్చే విమానాలను రద్దు చేసింది. యూకే నుంచి డిసెంబరు 22 అర్ధరాత్రిలోపు భారత్‌కు వచ్చే ప్రయాణికులు విమానాశ్రయాల్లో ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించింది. ఒకవేళ ఆర్‌టీ పీసీఆర్ పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలితే వారిని ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్‌కు పంపుతామని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హరదీప్ సింగ్ పూరి తెలిపారు. పరీక్షల్లో వైరస్ నెగెటివ్ వచ్చినా కూడా ఆయా ప్రయాణికులు ఏడు రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు.
శ్రీహరికోట సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఈ రోజు 3.41 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ-50 ఉపగ్రహ వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది.1410 కిలోల బరువుగల కమ్యూనికేషన్ శాటిలైట్లను నింగిలోకి మోసుకెళ్లింది. నాలుగు దశల రాకెట్ ప్రయాణాన్ని 20.11 సెకన్లలో ప్రయోగం ముగిసేటట్లుగా శాస్త్రవేత్తలు రూపకల్పన చేశారు. సీఎంఎస్-01 కమ్యూనికేషన్ శాటిలైట్‌ను నింగిలోకి ఇస్రో పంపింది. సీ-బ్యాండ్ సేవల విస్తరణకు సీఎంఎస్-01 దోహదపడనుంది. ఏడేళ్లపాటు సేవలందించనుంది. జిశాట్-12 స్థానాన్ని సీఎంఎస్-01 శాటిలైట్ భర్తీ చేయనుంది. సీఎంఎస్ -01 దేశానికి చెందిన 42వ కమ్యూనికేషన్ ఉపగ్రహం కాగా, పీఎస్‌ఎల్‌వీ సీ-50 ప్రయోగం మొదటి దశ విజయవంతం అయ్యింది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా రూపొందించిన పీఎస్‌ఎల్వీ రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్తోంది. రెండు టన్నులకు మించి బరువు కలిగిన అతి పెద్ద ఉపగ్రహాలను ఫ్రాన్స్, రష్యా అంతరిక్ష సంస్థల నుంచి ఇస్రో పంపిస్తోంది. అతి చిన్న విదేశీ ఉపగ్రహాలను పీఎస్‌ఎల్వీల ద్వారా ప్రయోగించి వాణిజ్యపరంగా ఇస్రోకు ఆదాయాన్ని తీసుకొచ్చేగనిగా మారింది. చంద్రయాన్, మంగళ్‌యాన్ లాంటి గ్రహాంతర ప్రయోగాలు, ఒకేసారి పది ఉపగ్రహాలు, 20 ఉపగ్రహాలు, ఆ తరువాత 104, మళ్లీ 38 ఉపగ్రహాలను సునాయాసంగా మోసుకెళ్లి అంతరిక్ష కక్ష్యలో ప్రవేశపెట్టగలిగిన ఘనత పీఎస్‌ఎలీ్వకే సొంతం. ఇప్పటి వరకు 51 పీఎస్‌ఎల్వీ రాకెట్లను ప్రయోగించగా అందులో రెండు మాత్రమే విఫలమయ్యాయి. గురువారం నాటి ప్రయోగంతో మరో కీలక ఘట్టానికి షార్ వేదికైంది.పీఎస్‌ఎల్వీ రాకెట్‌ను ఇస్రో రెండు రకాలుగా ఉపయోగిస్తోంది. తక్కువ బరువు కలిగిన ఉపగ్రహాలను తీసుకెళ్లేటప్పుడు స్ట్రాఫాన్ బూస్టర్లు లేకుండా చేస్తారు. దీన్ని కోర్ అలోన్ ప్రయోగమని ఇస్రో పరిభాషలో అంటారు.
♦ఎక్కువ బరువు కలిగిన ఉపగ్రహాలను మోసుకెళ్లాలంటే అత్యంత శక్తివంతమైన స్ట్రాపాన్ బూస్టర్లతో చేస్తారు. ఈ తరహా ఎక్సెల్ స్ట్రాపాన్ బూస్టర్లతో ఇప్పటికి 21 ప్రయోగాలు చేశారు.
♦ఇటీవలి కాలంలో రెండు స్ట్రాపాన్ బూస్టర్లతో చేసే ప్రయోగాన్ని పీఎస్‌ఎల్వీ – క్యూఎల్, నాలుగు స్ట్రాపాన్ బూస్టర్లతో చేసే ప్రయోగాన్ని పీఎస్‌ఎల్వీ – డీఎల్ అనే పేర్లతో చేస్తున్నారు.
♦వీటి ద్వారా కమ్యూనికేషన్ ఉపగ్రహాలు, రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు (దూర పరిశీలన ఉపగ్రహాలు), చంద్రయాన్ ∙1, మంగళ్‌యాన్ – 1 లాంటి గ్రహాంతర ప్రయోగాలు, భారత క్షేత్రీయ దిక్సూచి వ్యవస్థ ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి పంపించి దేశ ప్రజలకు అత్యంత సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంలో పీఎస్‌ఎల్వీ అగ్రగామిగా ఉంది.
♦ఎక్కువ ఉపగ్రహాలను మోసుకెళ్లి సూర్యానువర్తన ధ్రువకక్ష్యలో వివిధ రకాల కక్ష్యల్లో ప్రవేశపెట్టగలిగే సామర్థ్యం కలిగి ఉండే రాకెట్ కూడా ఇదే కావడం గమనార్హం.
ఓకే ఆర్బిట్.. ఎనిమిది రకాల కక్ష్యలు
ఒకే ఆర్బిట్‌లో ఎనిమిది రకాల కక్ష్యలను గుర్తించి ఎక్కువ ఉపగ్రహాలను తీసుకెళ్లిన ఘనత పీఎస్‌ఎలీ్వదే. గతేడాది జనవరి 24న పీఎస్‌ఎల్వీ సీ – 44 రాకెట్‌లో నాలుగో దశను ప్రయోగాత్మకంగా చేసి రెండు రకాల కక్ష్యల్లో మూడు ఉపగ్రహాలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఆ ప్రయోగమిచ్చిన విజయంతో ఏప్రిల్ 1న పీఎస్‌ఎల్వీ సీ – 45 ప్రయోగంలో నాలుగోదశ (పీఎస్ – 4) ద్వారా మూడు రకాల కక్ష్యల్లో 29 ఉపగ్రహాలను విడివిడిగా ప్రవేశపెట్టగలిగారు.
♦జనవరి 24న ప్రయోగించిన పీఎస్‌ఎల్వీ సీ – 44 ద్వారా పీఎస్ – 4 దశలో సూర్యానువర్తన ధ్రువకక్ష్యలోనే ఎనిమిది రకాల కక్ష్యలను గుర్తించింది.
♦భవిష్యత్తులో ఇంకా ఎక్కువ ఉపగ్రహాలను భూమికి 800 కిలోమీటర్ల ఎత్తు నుంచి 504 కిలోమీటర్లు తగ్గించుకుంటూ వస్తే 8 రకాల కక్ష్యల్లోకి ప్రవేశపెట్టే వీలుంటుందని గుర్తించింది పీఎస్‌ఎల్వీ రాకెట్టే కావడం గమనార్హం. పీఎస్‌ఎల్వీ సీ – 45లోని పీఎస్ – 4 దశ ముందుగా 753 కిలోమీటర్ల ఎత్తులోని సన్ సింక్రనస్ ఆర్బిట్‌లో ఈఎంఐ శాట్ అనే ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టాక పీఎస్ – 4 దశను మండించి మళ్లీ కిందికి తీసుకొచ్చి 508 కిలోమీటర్ల ఎత్తులో కొన్ని ఉపగ్రహాలు, 505 కిలోమీటర్ల ఎత్తులో మరికొన్ని ఉపగ్రహాలను ప్రవేశపెట్టి అంతరిక్ష ప్రయోగాల్లో చరిత్ర సృష్టించింది కూడా పీఎస్‌ఎల్‌వీ రాకెట్టే కావడం గమనార్హం.
కోవిడ్ 19 బారిన పడి చనిపోయిన జర్నలిస్టులను కూడా కరోనా వారియర్లుగా గుర్తించాలని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) కోరింది. ఈ మేరకు పీసీఐ కేంద్రానికి లేఖ రాసింది. డాక్టర్లను, ఇతర సిబ్బందిని కోవిడ్ వారియర్లుగా ఎలా గుర్తిస్తున్నారో అలాగే జర్నలిస్టులను గుర్తించాలని పీసీఐ లేఖలో కోరింది.
జర్నలిస్టులను కోవిడ్ వారియర్లుగా గుర్తించాలని కోరుతూ పీసీఐ కార్యదర్శి అనుపమ భట్నాగర్ కేంద్ర సమాచార, ప్రసార శాఖకు లేఖ రాశారు. ఈ మేరకు పీసీఐ ఓ తీర్మానం చేసింది. హర్యానా ప్రభుత్వం జర్నలిస్టులను కోవిడ్ వారియర్లుగా గుర్తించి వారికి ఇతరులకు అందిస్తున్న బెనిఫిట్స్ ను వర్తింపజేస్తుందని పీసీఐ తెలిపింది. కనుక కేంద్రం కూడా ఆ దిశగా ఆలోచన చేయాలని పీసీఐ కోరింది.
కాగా కరోనా నేపథ్యంలో చనిపోయిన ఇద్దరు డాక్టర్ల కుటుంబాలకు కేంద్రం ఇటీవలే రూ.50 లక్షల నష్ట పరిహారం అందజేసింది. సరిగ్గా అలాంటి ప్రయోజనాలనే జర్నలిస్టులకు కూడా వర్తింపజేయాలని పీసీఐ కోరింది. ఇక ఈ విషయమై పీసీఐతోపాటు జర్నలిస్టు యూనియన్, ఇండియన్ న్యూస్ కెమెరామన్ అసోసియేషన్, నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ సంఘాలు ప్రధాని మోదీకి మెమొరాండం కూడా సమర్పించాయి. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ఇటీవల ఓ మీడియా సమావేశంలో ఇదే విషయంపై సానుకూల వైఖరిని కనబరిచారు. మరి కేంద్రం జర్నలిస్టుల విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
బురేవి తుపాను కారణంగా తమిళనాడు, కేరళ రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. కేరళ, తమిళనాడులోని దక్షిణ జిల్లాలను ఈ తుఫాను తాకుందని ఐఎండి హెచ్చరికల నేపథ్యంలో రెడ్ అలర్ట్ ప్రకటించాయి. రెండు రాష్ట్రాల్లోని తీరప్రాంతాల్లో 24 గంటల్లో 20 సెంమీలకు పైగా భారీ నుండి అతిభారీ వర్షాలు పడతాయని ఐఎండి హెచ్చరించింది. తిరువనంతపురం ఎయిర్‌పోర్టులో విమాన కార్యకలాపాలను 8 గంటలపాటు (ఉదయం 10గంటలు- సాయంత్రం 6గంటలు) రద్దు చేస్తున్నట్లు ఎయిర్‌పోర్టు అధికారులు శుక్రవారం తెలిపారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో శుక్రవారం నుండి తుఫాను గండం తప్పేవరకూ త్రివేండ్రంలోని ఎయిర్‌పోర్టు మూతపడుతుందని తెలిపారు. ఇప్పటికే టిక్కెట్లు బుక్ చేసుకున్నవాళ్లు తమ సమయాల్లో మార్పుల కోసం, తాజా పరిస్థితులు తెలుసుకునేందుకు ఎయిర్‌లైన్స్‌ను సంప్రదించాలని త్రివేండ్రం ఎయిర్‌పోర్ట్ అథారిటీ ట్వీట్ చేసింది. అలాగే రివైజ్డ్ టైమ్ షెడ్యూల్‌ను కూడా షేర్ చేసింది.మరోవైపు బురేవి తుపాను బలహీన పడుతోందని వాతావరణశాఖాధికారులు తెలిపారు. బుధవారం శ్రీలంక తీరాన్ని దాటిన తర్వాత శుక్రవారం తమిళనాడు తీరాన్ని తాకుతుందని ముందుగానే ఊహించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం రామనంతపురానికి 40 కి.మీ దూరంలో ఉంది. తర్వాత తూత్తుకుడిని తాకుతుంది. ఇక్కడ 50-60 కిమీ వేగంతో గాలులు వీస్తాయని ఐఎండి హెచ్చరించింది. కేరళ ప్రభుత్వం ఇప్పటికే తిరువనంతపురం, కొల్లాం, పతనంతిట్టా, అలపుజా, ఇడుక్కి జిల్లాల్లో సెలవు ప్రకటించింది. తమిళనాడు కూడా విరుదంగర్, రామనంతపురం, తిరునెలెవి, తూత్తుకుడి, తెన్‌కాశి, కన్యాకుమారిలలో సెలవు ప్రకటించింది. మధురై ఎయిర్‌పోర్టులోనూ విమాన కార్యకలాపాలను రద్దుచేసింది. ట్యుటికోరిన్ ఎయిర్‌పోర్టు కూడా శుక్రవారం మూతపడుతుందని అధికారులు తెలిపారు.
ధూమపానం చేయని వారికే ఉద్యోగాలు ఇవ్వాలని జార్ఖండు సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జార్ఖండు ప్రభుత్వం తన కార్యాలయాలను పొగాకు రహిత మండలాలుగా ప్రకటించింది. తాము ధూమపానం చేయమని, పొగాకు నమలమని పేర్కొంటు ఉద్యోగులు అఫిడవిట్లను దాఖలు చేయడం తప్పనిసరి చేస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరబోయే వారు కూడా తాము ధూమపానం చేయమని, పొగాకు తినబోమని అఫిడవిట్లు సమర్పించాలి.
2021 ఏప్రిల్ నుంచి ఈ నిబంధనను జార్ఖండు సర్కారు అమలులోకి తీసుకువచ్చింది. పొగాకు ఉత్పత్తులైన సిగరెట్లు, బీడీ, ఖైనీ, గుట్కా, పాన్ మసాలా, జరదా, సుపారి, హుక్కా, ఈ సిగరెట్, పొగాకు ఉత్పత్తులను ఉపయోగించరాదని రాష్ట్ర ఆరోగ్య విద్య, కుటుంబసంక్షేమశాఖ ప్రకటనలో కోరింది. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు రంగ కార్యాలయాలు, ప్రధాన ద్వారాల వద్ద పొగాకు రహిత జోన్ అంటూ బోర్డులను ఉంచాలని జార్ఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సింగ్ అధికారులను ఆదేశించారు.
*అన్‌లాక్-6 కొత్త నిబంధనలను కేంద్రం విడుదల చేసింది.*
*- కరోనా మహమ్మారి విస్తరణ కొనసాగుతున్నందున సెప్టెంబర్ 30న ఇచ్చిన ఆదేశాలను మరో నెల రోజులు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర హోంశాఖ.*
★ అన్‌లాక్-6 నిబంధనలను కేంద్ర హోంశాఖ విడుదల చేసింది.
★ సెప్టెంబర్ 30న ఇచ్చిన అన్‌లాక్-5 ఆదేశాలను మరో నెల రోజులు పొడిగిస్తూ... ఉత్తర్వులు జారీ చేసింది.
★ కరోనా విస్తరణ ఇంకా కొనసాగుతున్నందున జాగ్రత్తగా ఉండాల్సిందేనని కేంద్రం సూచించింది.
★ కంటైన్మెంట్ జోన్లలో అన్ని రకాల ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది హోంశాఖ.
★ కంటైన్మెంట్ జోన్ల బయట... దాదాపు అన్ని రకాల కార్యకలాపాలకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది.
★ కంటైన్మెంట్ జోన్ల బయట రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించకూడదని తాజా మార్గదర్శకాల్లో చెప్పింది కేంద్రం.
_*అన్‌లాక్-6 నిబంధనలు..*_
★ సామాజిక, క్రీడా, విద్యా, వినోద, సాంస్కృతిక, రాజకీయ సమావేశాలకు 200 మంది వరకు హాజరయ్యేందుకు అవకాశం.
★ కరోనాను ఎదుర్కోవడానికి ఈ నెల 8న ప్రధాని ప్రారంభించిన 'జన ఆందోళన్'లో భాగస్వాములు కావడం.
★ మాస్క్‌లు ధరించడం, చేతులు తరచూ శుభ్ర పరుచుకోవడం, కనీసం ఆరు అడుగుల భౌతిక దూరాన్ని పాటించాలి.
★ ఈ మూడు పాటించేందుకు అవసరమైన ప్రచారం కల్పించాలని, క్షేత్రస్థాయిలో ప్రజలకు అర్థమయ్యే రీతిలో ప్రచారం చేపట్టాలని ఇప్పటికే అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు హోంశాఖ ఆదేశించింది.
★ రాష్ట్రాల మధ్య రాకపోకలకు ప్రభుత్వాలు ఎటువంటి అంతరాయం కల్పించకూడదు.
★ 10ఏళ్ల లోపు పిల్లలు, 65 ఏళ్లు దాటిన పెద్దలు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు, గర్భిణులు అత్యవసరం అయితేనే బయటికి రావాలి.
★ అంతర్జాతీయ ప్రయాణికులు, ఈత కొలనులు, వ్యాపార సమావేశాలు, వ్యాపార సంబంధిత ఎగ్జిబిషన్లు, సినిమా హాళ్లలో 50 శాతం వరకు అవకాశం కల్పిస్తూ.. సెప్టెంబర్ 30 ఆదేశాలు ఇచ్చిన కేంద్ర హోం శాఖ.. ఇవే ఆదేశాలు నవంబర్ నెలాఖరు వరకు కొనసాగుతాయని పేర్కొంది.
కరోనా కారణంగా అన్నీ మూతబడ్డాయి. మార్చి 22వ తేదీ నుండి మొదలుకుని కొన్ని నెలల పాటుగా అన్నీ మూతబడి ఉన్నాయి. టూరిస్ట్ ప్రదేశాలైతే చెప్పక్కర్లేదు. ప్రపంచంలో కరోనా కారణంగా భారీగా నష్టపోయిన రంగం ఏదైనా ఉందంటే అది టూరిస్ట్ రంగమే అని చెప్పవచ్చు. ఐతే ఇప్పుడిప్పుడే అన్నీ తెరుచుకుంటున్నాయి. కరోనా ఉధృతి పెరుగుతున్నా అన్ని కార్యకలాపాలు మొదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో
తాజ్ మహల్ సందర్శనానికి అనుమతులు లభించాయి. సెప్టెంబర్ 21వ తేదీ నుండి తాజ్ మహల్ ని సందర్శించవచ్చని ప్రభుత్వం ప్రకటించింది.
ఐతే రోజుకి కేవలం 5000మందికి మాత్రమే అనుమతులు ఇస్తారట. ఐతే సందర్శనకి వచ్చిన వారు అన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఒకరికి మరొకరికి మధ్య కనీసం ఆరు అడుగుల దూరం ఉండాలట. ఫోటో తీసుకున్నా కూడా ఈ నియమం వర్తిస్తుందట. నగదు చెల్లింపులకి అనుమతి లేదట. ఆన్ లైన్ చెల్లిపులకి మాత్రమే అనుమతి ఉంటుందట.
దిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలు దాదాపు ఖరారయ్యాయి. వచ్చే నెలలో ఈ సమావేశాలు నిర్వహించే యోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 1 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్ కమిటీ సూచించినట్టు సమాచారం. మొత్తం 18 రోజుల పాటు నిర్వహించనున్నారు. మరోవైపు, కరోనాతో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాల నిర్వహణ కోసం అధికారులు ఉభయసభల్లోనూ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భౌతికదూరం నిబంధనలకనుగుణంగా సభ్యులకు సీట్లు కేటాయించనున్నారు.
ఈసారి ఉభయ సభల్లోనూ ఛాంబర్లు, గ్యాలరీలు సభ్యులకే సీట్లు కేటాయించనున్నారు. రాజ్యసభలో 60 మంది సభ్యులు ఛాంబర్‌లో; మరో 51మంది గ్యాలరీల్లో, మిగతా 132 మంది సభ్యులు లోక్‌సభలో కూర్చొనేలా ఏర్పాట్లు చేయడం భారత పార్లమెంట్ చరిత్రలో 1952 తర్వాత ఇదే తొలిసారి. అలాగే, ఇదే తరహా సీటింగ్ ఏర్పాట్లను లోక్‌సభలోనూ చేస్తున్నారు. ఆయా ప్రదేశాల్లో భారీ తెరాలను ఏర్పాటు చేస్తున్నారు.
రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా జులై 17న సమావేశమై పార్లమెంట్ సమావేశాల నిర్వహణ ఏర్పాట్లపై చర్చించారు. ఛాంబర్లు, గ్యాలరీలను సైతం సభ్యులు కూర్చొనేందుకు వీలుగా ఉపయోగించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఆగస్టు చివరికల్లా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను వెంకయ్యనాయుడు ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.
న్యూఢిల్లీ: రైల్వే శాఖపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. కేంద్ర ప్రభుత్వం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్ప్ (ఐఆర్‌సీటీసీ) లోని తన వాటాల్లో కొంత షేర్ల భాగాన్ని ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా విక్రయించాలని(అమ్మకం) యోచిస్తోంది. ఈ నేపథ్యంలో పెట్టబడలకు సంబంధించిన సంస్థ (డీఐపీఏఎం) అమ్మకాల ప్రక్రియను నిర్వహించడానికి సెప్టెంబర్ 10 లోగా సెబీలో నమోదు చేసుకున్న మర్చంట్ బ్యాంకర్ల నుండి ప్రతిపాదనలను ఆహ్వానిస్తోంది....
మలమూత్ర విసర్జన ద్వారా కరోనా వ్యాప్తిఒకపక్క కరోనా వైరస్ తో ఎనిమిది నెలల నుంచి ఎప్పటికప్పుడు ఏదో ఒక వార్త వింటూనే ఉన్నా దానికి సంబంధించి పరిశోధనలో ఏదో ఒక సంచలన విషయం వెలుగులోకి వస్తూనే ఉంది. తాజాగా హైదరాబాద్ లో మురుగు నీటిలో కరోనా వైరస్ పై జరిగిన పరిశోధనలో ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. మురుగు నీటిని శుభ్ర పరిచే కేంద్రాల నుంచి నమూనాలను సేకరించి చూడగా మురుగు నీటి లో కరోనా వైరస్ లు ఉన్నాయని సిసిఎంబి డైరెక్టర్ రాకేశ్ మిశ్రా మీడియాకు వెల్లడించారు.సి సి ఎం బి, ఐ ఐ సి టి సంయుక్తంగా దీనిపై పరిశోధనలు చేశాయని ఆయన వెల్లడించారు. ముక్కు నోటి ద్వారానే కాకుండా మలమూత్ర విసర్జన ద్వారా కూడా వ్యాపిస్తుందని ఆయన కాసేపటి క్రితం మీడియాకు వెల్లడించారు.
వ్యాధి సోకిన 35 రోజుల తర్వాత కరోనా వైరస్ బయటకు వస్తుందని చెప్పారు.