హోంగార్డు వల్లం మునిస్వామి మృతి
హోంగార్డు వల్లం మునిస్వామి మృతి
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ఫిబ్రవరి 28(రవి కిరణాలు):-
సులూరుపేట రక్షణ నిలయంలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న వల్లం మునస్వామి (48) మంగళవారం నెల్లూరు నారాయణ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరాల మేరకు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మునుస్వామి ఆరోగ్యం విషమించడంతో నెల్లూరు నారాయణ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 22 సంవత్సరాలు పైగా సూళ్లూరుపేట రక్షణ నిలయంలో హోంగార్డు విధులు నిర్వహిస్తూ అందరికీ సుపరిచితుడైన మునుస్వామి అనారోగ్యంతో మృతి చెందడంతో మునస్వామి స్వగ్రామైన కాదలూరులో విషాదఛాయలనుకున్నాయి.