జనసేన పార్టీ PAC మెంబర్ చెన్నారెడ్డి మనుక్రాంత్ గారి మీడియా సమావేశం లో ముఖ్యాంశాలు.....

 



వైసిపి పాలన తో బ్రతుకు భారం
జిల్లా విభజన విషయం లో సంపన్న నియేజక వర్గాలను కోల్పతే పాలాభిషేకాలు,సంబరాలు ఎందుకు...? ఆస్థులలో వాటా  కోల్పోతే సంబరాలు వేడుకలు ఎవరైనా చేసుకుంటారా ..?  నెల్లూరు రూరల్ MLA శ్రీధర్ రెడ్డి గారు చేపట్టిన నేనూ నా కార్యకర్త కార్యక్రమం లో మీ  కార్య కార్యకర్తల బాగోగులు చూడటం మంచిదే,కానీ ఓట్లు వేసి గెలిపించిన ప్రజల అవస్థలు,బాగోగులు కూడ చూడాల్సింది మీ ముఖ్య భాద్యత  నెల్లూరు జిల్లా ప్రజలకు ఏమీ చేయని అదికార అహం తో ఉన్న మంత్రి అనీల్ కుమార్ గారు ఏ వివాదం లో ఇరుక్కున్నారో,మరియూ ఆయన అసమర్దత వలన జిల్లా ప్రతిష్ట దేశ వ్యాప్తంగా ఏ విధంగా భంగ పడిందో త్వరలో ప్రజలకు తెలియజేస్తాం...  పవన్ కళ్యాణ్ గరు తలపెట్టిన మత్య్సకార అభ్యున్నతి గూర్చి జనసేన PAC ఛైర్మన్ మనోహర్ గారు పాదయాత్ర తో కాకినాడ లో ప్రారంభించారు,మత్స్యకారుల గంటల వ్యవది లో ఎన్నో సమస్యలు విన్నవించారు,వారికోసం 20 ఫిభ్రవరి న పవన్ కళ్యాణ్ గారితో భారీ బహిరంగ సభకు మత్స్యకారులు తరలిరండి అని పిలుపు... స్థానిక సంస్థాగత ఎన్నికల్లో మీరు చేసిన దుర్మార్గాలు,దౌర్జన్యాలు అన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.ఇబ్బందులు పెట్టిన వైసిపీ వారినందరినీ ప్రజలు గుర్తు పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో మీ ఋణం వడ్డీ తో సహ తిరిగిచ్ఛేస్తారు ... ఇంత మంది ఎమ్మెల్యేలు ఉన్నా అభివృద్ధి శూన్యం,ప్రజల ఆవేదనను,కష్టాలను పట్టించుకునే నాథుడే లేడు, వైసీపీ ప్రభుత్వం  రాష్ట్రాన్ని 6,28,000 కోట్ల అప్పులతో ముంచేశారు  మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తానని ప్రగల్భాలు పలికిన వైసిపి ప్రభుత్వం ఈరోజు చీప్ లిక్కర్ తో ప్రజల ఆనారోగ్యాల పాలు చేస్తుంది. ఎయిడెడ్ విద్యా సంస్థల్ని రద్దు చేసి విద్యార్థులు ఆందోళనకు గురి చేస్తోంది  ఉద్యోగస్థులు సిపిఎస్ మాట అటుంచి వారి జీతాల పెంపు విషయంలో తీరని ద్రోహం చేసి రోడ్లమిద నిలబెట్టింది ఈ ప్రభుత్వం  రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించే విషయంలో విఫలం కావడమే కాకుండా యూరియా కూడా సప్లై చేయలేక ఉంది  యువత ఉధ్యోగ నోటిఫికేషన్లు అడిగితే  రోడ్లపై నిలబెట్టి అరెస్టు చేయిఅంచారు... జిల్లా లో రోడ్లంతా గుంతల మయం.. రాబోయే ఎన్నికలలో ప్రజలందరూ వైసిపి కి తగిన బుద్ది  చెప్తారు ,ప్రజల సమస్యలపై అండగా నిలబడి వారి సంక్షేమం గురించి ఆలోచించ గలిగిన జనసేన పార్టీ అధికారం లోకి రావటం ఖాయం...
      ఈ కార్యక్రమం లో జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహరాల కమిటీ సభ్యులు చెన్నారెడ్డి మనుక్రాంత్ గారితో జిల్లా ప్రదాన కార్యదర్శి గునుకుల కిషోర్,సిటీ నాయకులు దుగ్గిశెట్టి సుజయ్,కోవూరు నాయకులు శ్రీనివాసరెడ్డి మరియూ జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గన్నారు....