శ్రీసిటీ లోని కావేరి హాస్పిటల్ వైద్య శిబిరానికి విశేష స్పందన.
నెల్లూరుజిల్లా. తడ:-
మండలంలోని పరిసర ప్రాంతాల ప్రజల ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను మెరుగుపరిచే చర్యలకు పెద్దపీట వేస్తూ శ్రీసిటీ ఫౌండేషన్, కావేరీ హాస్పిటల్ మరియు కేర్ డెంటల్ ఇంటర్నేషనల్ సెంటర్‌తో కలిసి శనివారం మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది. తడ గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన ఈ శిబిరానికి మంచి స్పందన లభించింది. అధిక సంఖ్యలో ప్రజలతో పాటు విద్యార్థులు కూడా వైద్య సేవలను వినియోగించు కున్నారు.
వైద్య శిబిరం గురించి శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ, ఈ ప్రాంతంలోని ప్రజల ఆరోగ్య భద్రతకు తాము ఎప్పుడూ పెద్దపీట వేస్తామన్నారు. శ్రీసిటీ అభివృద్ధిలో ఆరోగ్య సంరక్షణ కీలకమైన రంగాలలో ఒకటిగా పేర్కొన్నారు. ఇందులో భాగంగా చుట్టుపక్కల నివసించే కమ్యూనిటీల ఆరోగ్యం మరియు శ్రేయస్సును ప్రోత్సహించడానికి శ్రీసిటీ వివిధ కార్యక్రమాలను చేపట్టిందన్నారు. ఇటువంటి మెడికల్ క్యాంపులు తరచూ నిర్వహించడం, ప్రజల నుండి మంచి స్పందనను అందుకోవడం చాలా సంతోషంగా ఉందిని తెలిపారు.
కాగా శనివారం జరిగిన క్యాంపులో కావేరి ఆసుపత్రి వైద్యులు సుధాకర్ ఆధ్వర్యంలో పలువురు డాక్టర్లు, కేర్ డెంటల్ ఇంటర్నేషనల్ సెంటర్ వైద్యులు శ్రీనివాస్ తో పాటు సహాయక పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు. శిబిరంకు వచ్చిన వారికి బిపి, షుగర్, ఇతర సాధారణ పరీక్షలతో పాటు ఉచిత మందులు పంపిణీ చేశారు. విద్యార్థులకు పేస్ట్, బ్రష్, మౌత్ వాష్ ఉచితంగా అందచేశారు. తడ, చుట్టుపక్కల మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన 184 మంది రోగులు వైద్య శిబిరంకు హాజరయ్యారు.
న్యూఢిల్లీ :-
తద్వారా ఉమ్మడి లక్ష్యాల సాధన సులభతరం అవుతుందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని భారత్ బలంగా విశ్వసిస్తోందన్నారు.
రాష్ట్రాల్లో ఉన్న వివిధ సమస్యల పరిష్కారానికి సైన్స్ అనేది ఏకీకృత సాధనమని స్పష్టం చేశారు.
ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్(ఐఐఎస్ఎఫ్)-2020లో భాగంగా నిర్వహించిన కార్యక్రమానికి ఆహ్వానం అందడం ఆనందంగా ఉంది.
శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రఖ్యాతి గాంచిన వివిధ ప్రముఖులు, మంత్రులు, నిపుణులతో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నా.
ఇందులో పాల్గొన్న రాష్ట్రాల మంత్రులు.. కరోనా అనంతరం జీవనోపాధి అంశాలపై చర్చించారు.
సైన్స్ అండ్ టెక్నాలజీ విషయాలను పొరుగు దేశాలతో పంచుకోవడాన్ని భారత్ సదా విశ్వసిస్తుంది.
- డా.హర్ష వర్ధన్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి
ప్రజల ప్రతి సమస్యను సైన్స్ ద్వారా పరిష్కరించవచ్చని ఆరోగ్య మంత్రి అభిప్రాయపడ్డారు.