పుట్టి స్వయం కృషి స్వీయప్రతిభ తో కష్టాలను అధిగమించి విద్యను అభ్యసించి.. MSc గణితం లో పూర్తిచేశారు
ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడురు డివిజన్ చిల్లకూరు మండలం వల్లిపేడు గ్రామం లో పుట్టి స్వయం కృషి స్వీయప్రతిభ తో కష్టాలను అధిగమించి విద్యను అభ్యసించి.. MSc గణితం లో పూర్తిచేశారు.. ఆ తర్వార యం బి ఏ పూర్తి చేసారు. ఉపాద్యాయ వృత్తిలో స్దిరపాడాలని చిననాటినుంచి కలలు గని.. ఆదిశగా అడుగులు వేసారు. కొన్ని కారణాల వల్ల బియడ్ ఎంట్రన్స్ రాయలేకపోవడంతో యం యస్ సీ పూర్తి చేసి..విఅర్ కాలేజీలో అద్యాపకుడిగా కరియర్ ప్రారంభించారు. తన గురువు కృష్ణారెడ్డితో కలసి ప్రేవేటుగా ట్యూషన్లు చెబుతూ..కొంతకాలం గడిపారు. అనంతరం ఓ కాలేజీని ప్రారంభించాలని భావించడం..తన గురువుతో ఆవిషయం ప్రస్తావించడం..ఆయన ఓకే చెప్పడంతో ధైర్యంగా ముందడుగు వేసి 140 మంది విద్యార్దులతో విద్యాసంస్దను ప్రారంభించారు. విద్యాసంస్దను ప్రారంభించిన అతికొద్దికాలంలోనే..జిల్లాలో ప్రజల ఆదరాభిమానాలు చూరగొని..నేడు వేలమంది విద్యార్దులకు ఉత్తమ విద్యను అందిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇటీవల ఈ కళాశాల విద్యార్దికి రాష్ట్రపతి నుంచి అవార్డుకూడా లభించింది. అలా పిల్లల తల్లితండ్రులు తమపైన పెట్టిన నమ్మకాన్ని వమ్ముచేయకుండా ముందుకుసాగుతున్నానంటూ ఎఁతో వినమ్రమతతో చెప్తారు. అందుకే రెడ్ క్రాస్ చైర్మన్ గా కూడా ఆయన ఎన్నికయ్యారు. కరోనా సమయంలో తన దానగుణాన్ని ప్రదర్సించి పలువురి ప్రశంశలు అందుకున్నారు. ఇప్పుడు తాజాగా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని ఇప్పుడు తూర్పు రాయలసీమ వైయస్ అర్ సి పి ఉపాద్యయ ఎమ్మెల్సి అబ్యర్దిగా ప్రకటించారు.