హైసన్ కంపెనీ సిబ్బంది కార్మికులపై వేధింపులు 

 వేధింపులు తట్టుకోలేక కార్మికులు గోడ దూకి పరార్ 

 వెతుకులాటలో హైసన్ సిబ్బంది 

 రవి కిరణాలు సూళ్లూరుపేట ఏప్రిల్ 12 :-

 తడ మండలంలోని మాంబట్టు సెజ్ లో వున్న హైసన్ కంపెనీ  సిబ్బంది నిర్వాహకుల కారణంగా కంపెనీలో పనిచేస్తున్న మహిళా కార్మికులపై వేధింపులు బెదిరింపులు తో సిబ్బంది నిర్వాహకులు రోజురోజుకీ మితిమీరడంతో ఆ కంపెనీలో పని చేసే మహిళా సిబ్బందికి సరిగా జీతాలు ఇవ్వక పోగా ఎక్కువ పనిగంటలు పనిచేయాలని సూచించడం, లేకపోతే జీతాలు ఇవ్వమని బెదిరించడం క్యాంటీన్లో భోజన సౌకర్యం సరిగా లేకపోవడం అడిగిన సిబ్బందిని తొలగించడం వారిని బెదిరిస్తూ అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేయడం వలన బుధవారం  కొంతమంది మహిళా యువతి కార్మికులు గోడదూకి పరారైన సంఘటన వెలుగు చూసింది పనిచేసే కార్మికులు ఉత్తరాది రాష్ట్రాల వారు కావడం వారిచే పనిగంటలు ఎక్కువ సేపు చేయించడం వారు వేధింపులు తాళలేక ఇంటికి వెళ్లి పోతామని కార్మికుల బతిలాడుతున్న వారిని కొట్టడం వేధించడం జీతాలు ఇవ్వకపోవడం అన్నం పెట్టకపోవడంతో కొంతమంది యాజమాన్యానికి చెప్పకుండా వేధింపులు తాళలేక గోడ దూకి వెళ్లిపోయిన సంఘటనలుగా ఉన్నాయి రోజుకు ఎనిమిది గంటలు పని గంటలు ఉన్న వారిచే పన్నెండు గంటలు ఓటి పేరుతో అదనంగా పనిచేస్తూ 7000 జీతం చెల్లిస్తూ వేధింపులకు గురి చేయడంతో కొంతమంది మహిళా కార్మికులు కంపెనీ గోడ దూకి రైల్వే స్టేషన్లో ప్రత్యక్షమయ్యారు ఈ విషయాన్ని సలో మీ కాంటాక్ట్ ని సంప్రదించగా మీరు రాకపోతే మీపై పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేస్తామని అగ్రిమెంట్ ప్రకారం మూడు సంవత్సరాలు పాటు ఇక్కడే ఉండాలని ఆంక్షలు పెట్టారని ఆ యువతులు తెలిపారు మా అగ్రిమెంట్ ప్రకారం రాకపోతే మీపై పోలీస్ కేసులు బనా ఇస్తామని హెచ్చరించడంతో వాళ్ల వేధింపులు తాళలేక మాకు ఉద్యోగం వద్దు అని మా రాష్ట్రానికి వెళ్ళిపోతామని కన్నీళ్ల పర్యంతమయ్యారు వారిని కాకతీయ ప్రతినిధులు రైల్వేస్టేషన్లో గుర్తించారు ఈ విషయంపై యాజమాన్యాన్ని అడగగా వాళ్లు మీడియా ప్రతినిధులతో దురుసుగా ప్రవర్తించారు ఈ ఘటనపై సంబంధిత అధికారులు స్పందించి విచారణ జరిపి కార్మికులకు న్యాయం చేయాలని యూనియన్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.