గుట్కా పట్టివేత 


స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్బ్యూరో అధికారులు దాడులు

గుట్కా పట్టివేత నిందితుని అదుపులోకి

సూళ్లూరుపేట పట్టణ పరిధిలోని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సూళ్లూరుపేట సీఐ RUVS  ప్రసాద్ వారి సిబ్బంది మూకుమ్మడిగా దాడి చేసి సూళ్లూరుపేట ఆర్టీసీ  బస్టాండ్  ఎదురుగా ఖాదర్వల్లి ఫ్యాన్సీలో చట్ట వ్యతిరేకంగా ఆరోగ్య హానికరమైన గుట్కాలు విక్రయిస్తుండగా వారి వద్ద నుండి తొంభై ఆరు గుట్కా బాక్సులు  అనగా మూడువేల ఆరు వంద ల యాభై గుట్కా ప్యాకెట్లు లను స్వాధీనం చేసుకోవడంతోపాటు సూళ్లూరుపేట మహదేవయ్య నగర్  . చెందిన  పఠాన్ ఖాదర్వల్లి  నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు   . స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సీఐ వెల్లడించారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  ఈ దాడుల్లో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సూళ్లూరుపేట  సి ఐ తో పాటు  హెడ్ కానిస్టేబుల్ చెంచయ్య కానిస్టేబుల్స్ పెంచలయ్య  హరిబాబు వెంకటేశ్వర్లు లు పాల్గొన్నారు.చట్ట వ్యతిరేకంగా  ఆరోగ్య హానికరమైన గుట్కాలు  అక్రమ మద్యం కలిగి ఉన్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని  సీఐ   హెచ్చరించారు.