గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ బదిలీ అయ్యారు
గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ బదిలీ అయ్యారు
విశాల్ గున్నీ ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన నెలరోజులవ్యవధిలోనే నిషేధిత పొగాకు పదార్థాలైన, గుట్కా, ఖైనీ స్మగ్లర్లపై కనెర్ర చేసి కోట్ల రూపాయల విలువ చేసే గుట్కా ప్యాకెట్లను స్వాదీనం చేసుకున్నారు. గుట్కా స్మగ్లర్ల గుండెల్లో రూరల్ ఎస్పీ చెరగని ముద్ర వేసుకున్నారు. రూరల్ ప్రాంతాలలో ఎక్కడైనా ఏదైనా హత్య,దొంగతనం,మానభంగం, వంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలుజరిగినా 24 గంటలలోపే ముద్దాయిలను అరెస్ట్ చేయించి, కోర్టులో హాజరు చేయించేవారు. గుంటూరు జిల్లాలో
తనకంటూ గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ తనకంటూ
ఒక ముద్రను వేసుకున్నారు.
రాష్ట్రంలోనే తొలిసారిగా పోలీస్ శాఖలో విన్నూత్నంగా డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం ప్రారంబించారు. డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమంలో వచ్చే ప్రతి ఫిర్యాదును చట్ట పరిధిలో
వెంటనే పరిష్కరించేదిశగా సబందిత పోలీస్ అధికారులను
జూమ్ యాప్ ద్వారా అదేశించేవారు.
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన బాపట్ల, పల్నాడు జిల్లాలు గతంలో, గుంటూరు రూరల్ పోలీస్ జిల్లా పరిధిలో ఉండేవి. ఆదివారం ఉదయం నుంచి రాష్ట్ర ప్రభుత్వం, బాపట్ల,
పల్నాడు(నరసరావుపేట) కేంద్రంగా పాలన సాగించడం
మొదలు పెట్టడంతో, రాష్ట్ర ప్రభుత్వం శనివారం రాత్రి
గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ ని మంగళగిరి లోని 6వ
బెటాలియన్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.