వెంకటగిరి మున్సిపల్ లో జేసీ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గున్న గూడూరు ఆర్డీవో కిరణ్ కుమార్

  భూ సమస్యల పరిష్కారానికి చర్యలు

  గృహ నిర్మాణంకు చర్యలు

  సాదాబైనామా పై అవగాహన సదస్సు

 త్వరలోనే తహశీల్దార్ తో సమీక్ష సమావేశాలు

  గూడూరు ఆర్డీవో కిరణ్ కుమార్
 రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు మేరకు రెవెన్యూ,హౌసింగ్ శాఖలల్లో అభివృద్ధి పై చర్చించేందుకు తహశీల్దార్ లతో శుక్రవారం తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వెంకటగిరి మున్సిపల్ కార్యాలయంలో   గూడూరు ఆర్డీవో కిరణ్ కుమార్ పాల్గున్నారు.

 ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ జాయింట్ కలెక్టర్ నీర్వహించిన వీడియో కాన్ఫరెన్సుకు తాను , వెంకటగిరి మునిసిపల్ కార్యాలయము నందు హాజరైనట్లు తెలిపారు. సదరు విడియో కాన్ఫరెన్స్ లో  జాయింట్ కలెక్టర్  పలు అంశాలపై చర్చించారు అని తెలిపారు.

 అందులో అన్ని రెవెన్యూ సంబంధిత సబ్జెక్టులు, వి ఎస్ డబ్ల్యు ఎస్  సేవలు,ఏపీ సేవ , హౌసింగ్ మరియు హౌస్ సైట్‌ల అసైన్‌మెంట్ ,అర్హత కలిగిన చట్టపరమైన వారసుడిని కలిగి ఉండటం, భూమి మార్పిడి అదేవిధంగా పి ఓ ఎల్ ఆర్ రీసర్వే పునరుద్ధరణ పూర్తి చేసిన  గ్రామాలు వంటి పై చర్చలు జరిగినట్లు తెలిపారు.

   అదేవిధంగా ఉత్పరివర్తనలు, ఈ కె వై సి, పాత సర్వే నెంబర్లు దిద్దుబాట్లు, జాయింట్ మ్యుటేషన్ ఐడెంటికల్ డూయింగ్ క్లరికల్ కరెక్షన్స్
 క్లరికల్ దిద్దుబాట్లు పూర్తి చేయడం, క్లరికల్ దిద్దుబాట్ల సమయంలో గుర్తించబడిన ఉమ్మడిఖాతాలు,సాదాబైనామా - ఫైల్ ప్రక్రియ, ఉత్పరి వర్తనలు,దిద్దుబాట్లు వ్యవసాయ భూముల కేటాయింపు, ఎఫ్ పి ఓ ఎల్ఆర్, సాదాబైనామా 22A కేసులు, లోక్ అదాలత్ (LAకి సంబంధించిన పలు విషయాలపై చర్చించండం జరిగిందిఅనీతెలిపారు.త్వరలోనే గూడూరు డివిజన్ పరిధిలోని తహశీల్దార్ లతో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి జాయింట్ కలెక్టర్ చెప్పిన విషయాలపై పూర్తి అవగాహన కలిగించి గ్రామాల్లో రెవెన్యూ సమస్యలు అన్నీ పరిష్కరిస్తాం అని తెలిపారు.