ఉచిత నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన
ఉచిత నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన
రవి కిరణాలు న్యూస్. తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట:-
పట్టణంలో ఆదివారం స్థానిక అలవల రోటరీ కంటి ఆసుపత్రి ఆవరణంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది.
మండల పరిసర ప్రాంత లోని ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సూళ్ళూరుపేట రోటరీ క్లబ్ , జువారి సిమెంటు వారు సంయుక్తంగా నిర్వహించిన ఉచిత నేత్రచికిత్సా శిబిరంనకు 156 మంది హాజరు కాగా 20 మందికి నేత్రచికిత్స కి ఎంపిక చేశారు.
ఈ కార్యక్రమానికి జువారిసిమెంటు మార్కెటింగ్ మేనేజరు కిశోర్ కుమార్, టెక్నికల్ ఇంజనీర్ వేమారెడ్డి లు ముఖ్య అతిథిగా హాజరై శిబిరంను ప్రారంబించారు.
శ్రీవెంకటేశ్వర అరవింద ఐ హాస్పిటల్ సహకారంతో కంటి వైద్యశిబిరంను నిర్వహించడం జరిగింది . రోటరీ అద్యక్ష, కార్యదర్శి లు ఆరణి విజయభాస్కర రెడ్డి ,దువ్వూరు సుబ్రహ్మణ్యం రెడ్డి, క్యాంపు చైర్మన్ కాశీభట్ల హరి, రోటరియన్లు అలవ సుధాకర్, సుంకర ప్రతిమ, జువారి సిమెంటు డిలరులు రొటేరియన్లు పాల్గొన్నారు.