ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు

రవికిరణాలు ప్రతినిధి -దొరవారిసత్రం:- మండల కేంద్రంలో గురువారం మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకలను తెలుగుదేశం పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్చార్జి నెలవల సుబ్రహ్మణ్యం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వేమసాని శ్రీనివాసులు నాయుడు ఎస్సీ సెల్ అధ్యక్షులు జకరయ్య ఆధ్వర్యంలో ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను జరుపుకున్నారు ఈ సందర్భంగా ముందుగా జన్మదిన సందర్భంగా కేక్ ను కట్ చేసి అందరికీ పంచి పెట్టారు ఈ సందర్భంగా నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మనం అందరం కలిసికట్టుగా పనిచేసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవాలని తెలిపారు సైకో ప్రభుత్వం వెళ్లి సైకిల్ ప్రభుత్వం వస్తేనే రాష్ట్రం అభివృద్ధి పేదలు అభివృద్ధి చెందుతారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మైనార్టీ సభ్యులు షబీర్ మండల యూత్ ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్యం మాజీ ఎంపీటీసీ ఉదయ్ కుమార్ మాజీ సర్పంచి కృష్ణమూర్తి సర్పంచ్ మనీ మండల నాయకులు రవీంద్ర నాయుడు శోభన్ బాబు నాయుడు బాబు నాయుడు గోపాల్ రెడ్డి సుబ్బారెడ్డి శ్రీనివాసరెడ్డి హరి నాయకులు కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు