సూళ్లూరుపట లో ఘనంగా మహా శివరాత్రి వేడుకలు.
 
శివాలయం లో పోటెత్తిన భక్తజనం .

సుప్రభాత సేవతో పూజలు ప్రారంభం .

స్వామి వారికి అరుణోదయాభిషేకం నిర్వహించిన అర్చకులు.

రవి కిరణాలు, తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట:-

సూళ్లూరుపేట లో వెలసి ఉన్న శ్రీ గంగా పార్వతి సామెత శ్రీ నాగేశ్వర స్వామి ఆలయం లో శనివారం
మహాశివరాత్రి సందర్భముగా శివాలయంలో శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు,ఆలయ చైర్మన్ చెన్నారెడ్డి
సుబ్రహ్మణ్యం రెడ్డి (స్వామి రెడ్డి) సారథ్యం లో జరుగుతున్న మహా శివరాత్రి బ్రమ్మోత్సవాలలో భాగంగా ఉదయం సుప్రభాత సేవతో పూజలు ప్రారంభించారు,అనంతరం స్వామి వారికి అరుణోదయాభిషేకము చేశారు,
మహా శివరాత్రి సందర్భముగా ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆలయానికి విచ్చేసి పరమ శివుని దర్శించి పూజలు
చేశారు. ఆయనకు ఆలయ చైర్మన్ స్వాగతం పలికి దర్శనం అనంతరం ఆలయ మర్యాదలు అందజేశారు, తెల్లవారు జాము నుండి ఆలయం వద్ద భక్తులు బారులు తీరి
స్వామి వారిని దర్శించుకున్నారు, ఆలయాన్ని పూల తో సుందరంగా అలంకరించడం
జరిగింది,మహా శివరాత్రి బ్రమ్మోత్సవాలలో ఉభయదాతలు ఉన్న వారి చేత వేదపండితులు
పూజలు చేయిస్తున్నారు , ఈ వేడుకల్లో ఆలయ ట్రస్ట్ సభ్యులు కొండూరు వెంకటేశ్వర్లు,ఒంటెల చెంగమ్మ ,గుండాల భువనేశ్వరి,రుద్రపాటి సూర్యనారాయణ,వంకా చంద్రశేఖర్ ,వేనాటి తిరుపాలమ్మ పాల్గొన్నారు ,ఆలయ ప్రధాన అర్చకులు పెటేటి సునీల్ కుమార్ శర్మ సారథ్యం లో పూజలు నిర్వహిస్తున్నారు. స్వామి వారిని దర్శించుకున్న
ప్రముఖుల్లో తడ ఎంపీపీ రఘు,జెట్టి వేణు యాదవ్,కౌన్సిలర్ మిజురు రామకృష్ణ రెడ్డి,
తదితరులు ఉన్నారు.