ఆర్ఎస్్కల ద్వారా ధాన్యం కొనుగోలు చేయాలి.
ఆర్ఎస్్కల ద్వారా ధాన్యం కొనుగోలు చేయాలి.
ఉదయగిరి, మేజర్ న్యూస్ : రైతులు పండించిన ధాన్యాన్ని మద్దుతు ధరతో రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని జిల్లా రైతు సంఘం నాయకులు కాకు వెం కటయ్య డిమాండ్ చేశారు. శనివారం ఆయన మండలంలోని కృష్ణారెడ్డిపల్లి, బిజ్జంపల్లి, లింగంనేనిపల్లి తదితర గ్రామాల్లో కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని పరిశీలించి రైతులతో చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రుణాలు మంజూరు చేయకపోవడంతో రైతులు వడ్డీలకు నగదు తెచ్చి పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేస్తున్నారన్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంట తీరా చేతికందే సమయంలో ధర లేకపోవడం దారుణమన్నారు. గతేడాది 75 కేజీల ధాన్యం బస్తా రూ.2,500లు ఉండగా, ప్రస్తుతం రూ.1,400లు పలకడంతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కూటమి ప్రభుత్వం పంటలకు గిట్టుబాటు ధర కల్పించి ఆర్ఎస్కేల దాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు కొండా రామిరెడ్డి, చిన్నపురెడ్డి, నరసంహారెడ్డి, చెంచురెడ్డి, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.